Revanth Reddy | రేవంత్ రెడ్డి మాదిరిగా హైదరాబాద్‌లో గణేషుని విగ్రహం..ఆగ్రహం వ్యక్తం చేసిన రాజా సింగ్
Revanth Reddy | హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి.. గణేష్ పండుగ అంటే హైదరాబాద్‌లో అతి పెద్ద వేడుక. ఇప్పుడు ఇదే ఉత్సాహం విమర్శలకు కారణమవుతోంది. హబీబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ నేత, తెలంగాణ మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నగరంలో పెను దుమారం రేపుతోంది.
#image_title
ఆగ్రహం..
షర్ట్ ,ఫ్యాంట్ ,షూ ధరించిన రేవంత్ రెడ్డి విగ్రహానికి తల భాగంలో వినాయకుడి శిరస్సును ఏర్పాటు చేసి, రేవంత్ రెడ్డి వినాయకుడి రూపంలో ధర్మశమిస్తున్నట్లుగా ఇక్కడ మండపంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. వినాయక మండపాన్ని సైతం తెలంగాణ రైజింగ్ అనే హోర్డింగ్ లతో ఏర్పాటు చేశారు.
ఇలా ఏకంగా సిఎం రేవంత్ రెడ్డిని వినాయకుడి రూపంలో మార్చి , నవరాత్రి పూజలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాాలు దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకోవాలంటున్న రాజాసింగ్, ఫిర్యాదులు పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు.