ఈటెల విషయంలో రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు అంటూ ఆయన సన్నిహితులు అంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరీ దారుణంగా మూడవ స్థానంకు పడిపోతున్న ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని కొందరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే టీఆర్‌ఎస్ నుండి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి లాగేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈటెల కోసం తీవ్ర ప్రయత్నాలు..
ఈటెల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకునేందుకు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు అంతా కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. మొదటి నుండి ఈటెల విషయంలో కేసీఆర్ ఏదో చేయబోతున్నాడు అంటూ రేవంత్ రెడ్డి అనుమానిస్తూనే ఉన్నాడు. అన్నట్లుగానే మంత్రి పదవిని తొలగించి పార్టీ నుండి కూడా తొలగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మంత్రి పదవి తొలగించిన తర్వాత ఇప్పటి వరకు ఈటెలతో రేవంత్ రెడ్డి పలు సార్లు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వీరి రహస్య మంతనాలు ఇద్దరు కలిసి పని చేయడమే అంటున్నారు. ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకున్న నాయకులు కనుక ఇద్దరు కలిసి పని చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
కొత్త పార్టీకి ఛాన్స్ లేదు..
ఈటెల రాజేందర్ తో కలిసి రేవంత్ రెడ్డి కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు గాను సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని ఈ సమయంలో కొత్త పార్టీ కంటే కాంగ్రెస్ లోనే ఉండి ఇద్దరు కలిసి కేసీఆర్ ను ఢీ కొట్టడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తుంది. భారీగా ఊహాగాణాలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి నుండి ఇప్పటి వరకు అధికారికంగా స్పందన అయితే రాలేదు. ముందు ముందు వీరి కలయిక మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు. ఈటెల ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఈటెల రాజకీయ భవితవ్యం ఏంటీ అనేది చూడాలి.