హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని భావించిన మాజీమంత్రి కొండా సురేఖ ఇందుకు నో చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఈ విషయాన్ని నిన్ననే స్పష్టం చేశారు. పోటీపై ఏదో ఒక నిర్ణయం చెప్పాలని టీపీసీసీ కొండా సురేఖకు డెడ్ లైన్ విధించింది. అయితే తన షరతులపై టీపీసీసీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆమె హుజూరాబాద్‌లో పోటీ చేయడంపై వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టిన టీపీసీసీ…
తాజాగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ నాయకుడు బలుమూరి వెంకట్ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపడంతో.. తాము కూడా విద్యార్థి నాయకుడైన వెంకట్‌ను బరిలోకి దింపితే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే రెండు నెలల పాటు విద్యార్థుల సమస్యలపైనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్న తెలంగాణ కాంగ్రెస్.. ఈ క్రమంలోనే హుజూరాబాద్‌లో విద్యార్థి నాయకుడిని బరిలోకి దింపితే బాగుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వెంకట్ గతంలో పెద్దపల్లి సీటు ఆశించారని.. తాజాగా పెద్దపల్లి పక్కనే ఉండే హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆయనను కోరినట్టు తెలుస్తోంది. అంతకుముందు హుజూరాబాద్ బరిలో పత్తి కృష్ణారెడ్డితో పాటు ఇతర పేర్లను కాంగ్రెస్ నాయకత్వం పరిశీలించిందని.. ఈ క్రమంలోనే కొత్తగా వెంకట్ పేరు తెరపైకి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్, బీజేపీలకు బలమైన పోటీ ఇవ్వాలని అవసరం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితేనే బాగుంటుందని, అందుకే కొండా సురేఖను బరిలోకి దింపేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించింది.
కానీ.. కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇప్పుడు ఎవరో ఒకరిని అభ్యర్థిగా ఖరారు చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు వచ్చింది. ఇందుకు పలువురి పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకత్వం.. వారిలో బలుమూరి వెంకట్ పేరును సీరియస్‌గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈసారి హుజూరాబాద్ బరిలో నిలవబోయే కాంగ్రెస్ అభ్యర్థిని.. వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే పోటీ చేసేలా ఉండాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.