RGV vs Ysrcp : ట్విట్టర్ వార్.. తగ్గేదేలే అంటున్న ఆర్జీవీ.. రెచ్చిపోతున్న ఏపీ మంత్రులు..!
RGV : మాటల యుద్ధం కాస్త పోస్టుల యుద్ధం వరకు వచ్చింది. రేపటి రోజున ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అర్థంకాక నెటిజన్లతో పాటు జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సినీ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం నోరుమెదపడం లేదు. ఆర్జీవీ ఒక్కడే సినీ ఇండస్ట్రీ బాధ్యతలను తన భుజాన వేసుకుని ఏపీ ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మొన్నటివరకు సీఎం జగన్‌తో ఒకటికి రెండు సార్లు సినీ పరిశ్రమను ఏపీలో ఏర్పాటు చేసే అంశం, రాయితీలు, మినహాయింపుల కోసం విమానాల్లో వెళ్లి మరీ భేటీ అయ్యారు. ప్రస్తుతం టికెట్ ధరల తగ్గింపు విషయంపై అటు నిర్మాతల మండలి గానీ, అగ్ర హీరోలు మాత్రం నోరు మెదపడం లేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరికంటే ముందు ఆన్‌లైన్ టికెట్, ధరల తగ్గింపు విషయంపై నోరు మెదిపారు. ఆ తర్వాత హీరో నాని కూడా పవన్‌కు సపోర్టుగా మాట్లాడారు. అయితే, వీరిపై ఏపీ మంత్రులు అనిల్ కుమార్, కొడాలి నాని, పేర్ని నాని విరుచుకపడిన విషయం తెలిసిందే. పేదల సొమ్మును కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మీకు మాట్లాడే అర్హత లేదంటూ ఫైర్ అయ్యారు. తాజాగా వీరికి మద్దతుగా రామ్ గోపాల్ వర్మ వచ్చి చేరారు. మొన్నటివరకు జగన్ పాలనను మెచ్చుకున్న ఆర్జీవీ.. సినిమా టికెట్ ధరల తగ్గింపు నిర్ణయంపై జగన్ పాలనకు వ్యతిరేకంగా స్టెప్ తీసుకున్నారు. నాకు మీ పాలన నచ్చలేదని దిగిపోతారా? అంటూ ప్రశ్నించారు.
RGV : పేర్నినానికి అదిరిపోయే కౌంటర్
సినిమా టికెట్ ధరలు తగ్గించడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉందంటూ ప్రశ్నించారు. తాజాగా మంత్రి పేర్నినాని, ఆర్జీవీ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం నడుస్తోంది. ‘‘సినిమాను నిత్యవసర, అత్యవసర సర్వీసుగా మేము భావించడం లేదని, విద్యా, వైద్యానికి ఇచ్చినట్టు సినిమాకు మేము సబ్సిడీ ఇవ్వబోమని మంత్రి పేర్ని నాని చెప్పడంతో.. టికెట్ రేట్లు తగ్గిస్తున్నది పేదవాడికి అందుబాటులో ఉండాలని.. ఎందుకంటే సినిమాను నిత్యావసర వస్తువుగా పరిగణిస్తున్నామని చెప్పింది మీ నాయకులే.. అది కానప్పుడు అసలు ఈ డిస్కషన్ ఎందుకు ఇష్యూ లేనప్పుడు?’’అంటూ ఆర్జీవీ మంత్రికి కౌంటర్ ఇచ్చారు. దీనిని నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.