Rohit Sharma | రోహిత్ శర్మ – రితికా డ్యాన్స్ వీడియో వైరల్.. హిట్‌మ్యాన్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rohit Sharma | రోహిత్ శర్మ – రితికా డ్యాన్స్ వీడియో వైరల్.. హిట్‌మ్యాన్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా!

 Authored By sandeep | The Telugu News | Updated on :15 August 2025,1:00 pm

Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మరియు ఆయన భార్య రితికా సజ్దే కలిసి డ్యాన్స్ చేసిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మైదానంలో సీరియస్ మూడ్‌లో కనిపించే రోహిత్‌ను ఈ వీడియోలో సరదాగా స్టెప్పులు వేస్తూ చూడటం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

పాత వీడియో..

#image_title

ఈ వీడియో రితికా సోదరుడి పెళ్లి వేడుక సందర్భంగా 2023లో తీసినదిగా సమాచారం. ఇందులో రోహిత్, రితికాతో పాటు పెళ్లికూతురు కలిసి స్టేజ్‌పై బాలీవుడ్ హిట్ సాంగ్ “లాల్ ఘాగ్రాకి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.అప్పట్లో ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్, కుటుంబ వేడుకలో భాగంగా డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ వీడియోపై అభిమానులు స్పందిస్తూ ..“గ్రౌండ్‌లోనూ, స్టేజ్‌పైన కూడా హిట్ హిట్‌మ్యానే!” అంటూ కామెంట్లతో ప్ర‌శంసలు కురిపిస్తున్నారు.

రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లడం విశేషం.మొదటి స్థానంలో శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి టెస్ట్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌కి మాత్రమే అందుబాటులో ఉన్నారు.అక్టోబర్‌లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం ముంబైలో మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో శిక్షణ ప్రారంభించినట్లు సమాచారం

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది