Rohit Sharma : టీమిండియాకి వరల్డ్ కప్ అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులలోకి ఎక్కాడు. 2007లో ధోని నాయకత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ దక్కించుకోగా, 2024లో రోహిత్ నాయకత్వంలో భారత్ మరో టీ20 వరల్డ్ కప్ అందుకుంది. దీంతో దేశం మొత్తం సంబరాలు జరుపుకుంది.ఇక బీసీసీఐ కూడా టీమిండియా ఆటగాళ్లతో ముంబైలో బస్ ర్యాలీ నిర్వహించింది. కార్యక్రమానికి భారీఎత్తున అభిమానులు హాజరయ్యారు.ఇక అంబాని చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమం లో టీ20 ప్రపంచకప్ విజేతలు, ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు అరుదైన గౌరవం లభించింది.
సంగీత్ వేడుక వేదికపైకి నీతూ అంబాని ఒక్కొక్కరిగా ఆహ్వానించింది. ముందుగా రోహిత్ శర్మని ఆహ్వానించింది. ఆ సమయంలో నీతూ ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్‌ని, అనంతరం హార్ధిక్ పాండ్యాని వేదికపైకి ఆహ్వానించారు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే 17 ఏళ్ల టీమిండియా కలని సాకారం చేశారని, వారితో ఇలా పార్టీ చేసుకోవడం సంతోషంగా ఉందని నీతూ అన్నారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలవాలంటూ 140 మంది కోట్ల మంది భారతీయులు కోరుకుంటోన్నారని, వారి ఆశలు ఫలించాయని పేర్కొన్నారు. టీమిండియా క్రికెటర్లను రియల్ హీరోగా అభివర్ణించారు. ఐపీఎల్‌లో నీతా అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తరఫున ఈ ముగ్గురూ ఆడుతున్న విషయం తెలిసిందే.
గతంలో గుజరాత్ టైటాన్స్ కేప్టెన్‌గా పని చేసిన హార్దిక్ పాండ్యాను అదేపనిగా పిలిపించుకున్నారు నీతా. అప్పటివరకు కేప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను తొలగించి ముంబై ఇండియన్స్ కేప్టెన్సీ పగ్గాలను పాండ్యా అప్పగించారు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపింది. నీతా అంబానీతో విభేదాల వల్లే రోహిత్ శర్మను కేప్టెన్సీ హోదా నుంచి తొలగించారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ సంగీత్ సెలబ్రేషన్స్‌లో రోహిత్ పట్ల నీతా చూపిన ఆప్యాయతను చూస్తోంటే ఆ విభేదాలు తొలగిపోయినట్టే అనిపిస్తుందని, త్వరలో అతనికి కెప్టెన్సీ అవకాశం ఇస్తారని అంటున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.