Royyala Pulusu : ఆంధ్ర స్టైల్ లో ఎంతో కమ్మటి రొయ్యల పులుసు.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే…
Royyala Pulusu : రొయ్యలు అంటే ఎవరికైనా నోట్లో నీళ్లు రావాల్సిందే. అంత రుచిగా ఉంటాయి ఈ రొయ్యలు ఈ రొయ్యలను ఎన్నో వెరైటీలు చేస్తూ ఉంటారు ఎలాంటి వెరైటీ అయినా ఒక్కసారి తిన్నారంటే ఇక అస్సలు వదలరు.. ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్ లో రొయ్యల పులుసు చేసి చూద్దాం…
కావాల్సిన పదార్థాలు : రొయ్యలు, చింతపండు రసం, ధనియా పౌడర్, కారం, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు ,దాల్చిన చెక్క ,ఉల్లిపాయలు, టమాటాలు, కర్వేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి, పేస్ట్ , మెంతులు, ఆవాలు, ఆయిల్ మొదలైనవి… తయారీ విధానం : ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకొని వాటిని ఒక బౌల్లో వేసి దానిలో కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. తర్వాత దానిలో ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్ల కారం, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ ని వేసి దానిలో ఒక బిర్యానీ ఆకు, రెండు యాలకులు, రెండు లవంగాలు, రెండు దాల్చిన చెక్క, అలాగే నాలుగు మెంతులు కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అయ్యేవరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని దాన్లో వేసి తర్వాత వాటితోపాటు టమాటా ముక్కలను కూడా వేసి టమాట ముక్కలు మెత్తబడే వరకు సిమ్లో పెట్టి మంచిగా ఆయిల్ పైకి వచ్చేవరకు వేయించుకోవాలి. తర్వాత వేసి ఒక స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని వేసి ఒక గ్లాసు నీటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. సింలో పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత 7 ,8 నిమిషాల తర్వాత పులుసు దగ్గరికి అయిన తర్వాత దాన్లో గరం మసాలా,కొత్తిమీర జల్లుకొని దింపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ లో రొయ్యల పులుసు రెడీ.