Sabitha Indrareddy : గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సబితాఇంద్రారెడ్డి.. త్వరలోనే ఖాళీల భర్తీ
Sabitha Indrareddy : మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆయా యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆ దిశగా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. యూనివర్సిటీ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థుల కెరీర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు. ఆయా యూనివర్సిటీల వీసీలతో, సీఎస్, ఉన్నత విద్యా మండలి అధికారులతో సమావేశమైన ఆమె.. ఉద్యోగాల కోసం ట్రైనింగ్, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కోసం యూనివర్సిటీల్లో స్పెషల్ విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రానుందని.. కాబట్టి అందుకు విద్యార్థులను రెడీ చేసేందుకు యూనివర్సిటీలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని వెల్లడించారు. పరిశ్రమలు, పరిశోధనా సంస్థలతో యూనివర్సిటీలు నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీలు.. ప్రైవేట్ యూనివర్సిటీలకు దీటుగా తయారవ్వాలన్నారు. విద్యార్థుల్లో ఎప్పటికప్పుడు ఆత్మస్థైర్యాన్ని నింపాలని సూచించారు.భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగే కోర్సులను గుర్తించాలని ఆదేశించారు.యూనివర్సిటీలకు పరిశోధనలే ప్రామాణికంగా ఉంటాయన్నారు.
Sabitha Indrareddy : విద్యార్థులు ఉద్యోగంతోనే బయటకు వెళ్లాలి
స్టూడెంట్స్‌కు మెరుగైన బోధన అందించడంలో అవి సహాయపడతాయని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు ఉద్యోగంతోనే బయటకు వెళ్లేలా ప్లాన్ చేయాలని సూచించారు. ఆయా యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా యూనివర్సిటీల్లోని ఖాళీలతో పాటుగా ఆయా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ రాకపోవడంతో చాలా మంది ఏజ్ బార్ అవుతూ అర్హత కోల్పేయే చాన్స్ ఉందని వాపోతున్నారు. ఈ విషయాన్ని సైతం ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్స్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.