Viral Video : యూనివర్సిటీ విద్యార్థులకు కాళ్లతో తొక్కిన ఆహారాన్ని పెడుతున్న సిబ్బంది.. వీడియో..!!

Advertisement

Viral Video : ప్రస్తుత రోజుల్లో లాభం కోసం చాలా దిగజారి పోతున్నారు జనాలు. ఎదుటివారి క్షేమాన్ని పక్కనపెట్టి జోబులోకి డబ్బులు వచ్చాయా లేదా అనే ధోరణితో సమాజం ఉంది. ఎటువంటి రంగంలోనైనా లాభం కోసమే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే రీతిలో ఉన్నత చదువులు చదివే యూనివర్సిటీ విద్యార్థులకు కాళ్లతో తొక్కిన ఆహారాన్ని హర్యానాలో పెడుతూ ఉన్నారు.దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటపడింది. పూర్తి విషయంలోకి వెళ్తే హర్యానాలో ఒక ప్రైవేటు యూనివర్సిటీ క్యాంటీన్ నందు ఆలుగడ్డలు ఉడికించిన తర్వాత.

Advertisement

అదే కాంటీన్ లో పనిచేసే సిబ్బంది.. కూర ఉండే బేసినీలో కాళ్లతో తొక్కుతూ ఉన్నారు. ఈ విధానాన్ని క్యాంటీన్లో జరుగుతున్న ఈ చిరాకు పనిని అదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థి వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. రెడ్ హ్యాండెడ్ గా అన్నీ కూడా క్లియర్ కట్ గా క్యాంటీన్లో జరుగుతున్న ఈ అసహ్యమైన ఆహారాన్ని తయారు చేసే విధానాన్ని చూసిన విద్యార్థులు ఫుడ్డు తినడం మానేశారు.

Advertisement
a staff serving trampled food to haryana university students
Viral Video : యూనివర్సిటీ విద్యార్థులకు కాళ్లతో తొక్కిన ఆహారాన్ని పెడుతున్న సిబ్బంది.. వీడియో..!!

ఈ ఘటన హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగింది. యూనివర్సిటీ సిబ్బంది ఈ రకంగా తమకి ఆహారాన్ని అందించడం పట్ల విద్యార్థులు నిరసన కూడా వ్యక్తం చేశారు. భారీగా ఫీజులు తమ దగ్గర తీసుకొని ఈ రకంగా ఫుడ్ పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలో ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

Advertisement
Advertisement