Kadapa.. వైఎస్సార్‌ఏఎఫ్‌యూ పీజీసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kadapa.. వైఎస్సార్‌ఏఎఫ్‌యూ పీజీసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

 Authored By praveen | The Telugu News | Updated on :6 September 2021,7:00 am

ఏపీ సర్కారు కడపలో ప్రారంభించిన ప్రెస్టీజియస్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఆరు కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీ సెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే గడవును ఈ నెల 29 వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారు రెండేళ్లపాటు మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్, మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (పెయింటింగ్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (అప్లయిడ్‌ ఆర్ట్స్‌), పీజీ డిప్లొమా ఇన్‌ సినిమాటోగ్రఫీ కోర్సుల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. 2021–22 అకడమిక్ ఇయర్ కోసం వారు దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఇందుకు సంబంధించిన అర్హతలు, ఇతర పూర్తి వివరాలకు వైఎస్‌ఆర్‌ఏఎఫ్‌యూ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కోరారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే వారు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ నిర్వహిస్తున్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ కోసం లేట్ ఫీజు లేకుండా ఈ నెల 20 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేటు ఫీజుతో ఈ నెల 24 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 8790571779 ఫోన్ నెంబర్‌లోనూ సంప్రదించొచ్చని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పేర్కొన్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది