Sacred Sunday: ఆదివారానికి ఎంతో పవిత్రత ఉందట.. ఆ రోజు అలాంటి పనులు చేయొద్దట..!
Sacred Sunday: సూర్యభగవానుడిని ఆరాధించడం అనేది మన భారతీయ హైందవ సంస్కృతి. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి. సూర్యుడు అంటే రవి. రవి వారం అంటే ఆదివారం. కాబట్టి ఆదివారం ఎంతో పవిత్రమైన దినం. అందుకే మన సనాతన ధర్మంలో, పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకు ఇవ్వని ప్రాధాన్యం ఆదివారానికి ఇచ్చారు.
పురాతన రోజుల్లో ప్రజలు ఆదివారం ఎలాంటి అపవిత్రమైన కర్మల జోలికి వెళ్లేవారు కాదట. పూజలు, పునస్కారాలతో పవిత్రంగా గడిపేవారట. కానీ బ్రిటీష్ వాడు చేసిన కుట్ర కారణంగా ఇప్పుడు ఆ ఆదివారాన్ని పూర్తిగా అపవిత్రం చేస్తున్నారు. ఆదివారం సెలవు పేరుతో ఏ పనులైతే ఆ రోజు చేయకూడదో ఆ పనులనే ఎక్కువగా చేస్తున్నారు. మాంసం తింటున్నారు. మద్యం సేవిస్తున్నారు.
Sacred Sunday: బ్రిటిషర్ల కుట్రతో పవిత్రత కోల్పోయిన ఆదివారం
ఇంతకూ బ్రిటీష్ వాడు ఏం చేశాడు అనుకుంటున్నారా..? భారతీయులు ఆదివారాన్ని ఇంత పవిత్రంగా భావించడం చూసి ఓర్వలేక బ్రిటిషర్ పాలకుడు థామస్ బాబింగ్టన్ మెకాలే.. ఇండియాలో కూడా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించాడట. ఎందుకంటే సెలవునాడే తీరిక ఉంటుంది కాబట్టి.. ఆ రోజు దైవారాధన వదిలేసి తనకు నచ్చిన పనులతో గడుపుతారని ఇలా చేశాడట. అతడి కుట్రకు తగ్గట్టే ఇప్పుడు భారతీయుల జీవితాల్లో ఆదివారం ఎంజాయ్‌మెంట్ డేగా మారిపోయిందట.
ఒకప్పుడు భారతీయ హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారట. ఆరోజు జీవహింస చేసేవారు కాదట. కనీసం మాంసాహారం ముట్టేవారు కాదట. మద్యం జోలికి కూడా వెళ్లేవారు కాదట. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఆదివారం వచ్చిందంటే సెలవు దినం కదా అని మధ్యాహ్నం వరకు నిద్రలేవని వాళ్లు ఉన్నారు. ఇక దైవాన్ని ఏం ఆరాధిస్తారు..? దైవారాధన సంగతి పక్కన పెడితే మాంసం, మద్యం హితంగా పుచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.