రఘురామ డ్రామా.. జ‌గ‌న్ , చంద్ర‌బాబు మ‌ద్య‌లో కేసీఆర్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

రఘురామ డ్రామా.. జ‌గ‌న్ , చంద్ర‌బాబు మ‌ద్య‌లో కేసీఆర్‌..!

 Authored By himanshi | The Telugu News | Updated on :19 May 2021,3:35 pm

తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసు హాట్ టాపిక్ గా ఉంది. ఏపీ సీఐడీ వారు రాజద్రోహం కేసును సుమోటోగా రఘురామ కృష్ణం రాజుపై నమోదు చేసి విచారిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈ కేసు ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్లింది. బెయిల్‌ పిటీషన్ ను సుప్రీం కోర్టులో వేయడంతో పాటు ఈ కేసులో ఏ2 మరియు ఏ3 అయిన టీవీ5 మరియు ఏబీఎన్ లు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ కేసులో అక్రమంగా తమ పేర్లను ఇరికించారంటూ వారు పిటీషన్‌ లో పేర్కొనడం జరిగింది. దాంతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఆ విమర్శలను ఎదుర్కొనేందుకు వైకాపా నాయకులు ముందుకు వచ్చారు. తమపై వస్తున్న ఆరోపణలను వైకాపా నాయకుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయిన సజ్జల రామకృష్ణ ఖండించారు. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింతగా చర్చకు తెర లేపాయి.

రఘురామ డ్రామా..

బెయిల్‌ పిటీషన్ సమయంలో కుటుంబ సభ్యులు తీసుకు వచ్చిన బోజనం తిని చాలా ఆరోగ్యంగా కనిపించడంతో పాటు మీసం మెలేసి కాళ్లను చూపించిన వ్యక్తి కారు దిగిన వెంటనే మీడియా ముందు నడవలేని పరిస్థితుల్లో ఉండటం విడ్డూరంగా ఉంది. ఆయన డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఈ కేసుతో జగన్ ప్రభుత్వంకు అస్సలు సంబంధం లేదు.

sajjala ramakrishna comments on cbn and kcr

sajjala ramakrishna comments on cbn and kcr

సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఈ విషయంలో అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం ఈ విషయంలో మంత్రులు కూడా భాగస్వామ్యులు కారు అంటూ సజ్జల పేర్కొన్నారు. మీడియాలో పబ్లిసిటీ మరియు కేసు నుండి తప్పించుకోవడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. సుప్రీం కోర్టులోనే అసలు విషయాలు తెలుస్తాయంటూ సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశాడు.

కేసీఆర్‌ పై బాబు కేసులు…

రాజ ద్రోహం కేసును ఎంపీ రఘురామ పై పెట్టడం ఏంటో అంటూ చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేయడం చిత్రంగా ఉందంటూ సజ్జల పేర్కొన్నారు. అసలు రాజ ద్రోహం కేసు గురించి చంద్రబాబు నాయుడు తెలియదేమో అన్నట్లుగా ఫేస్ పెట్టి అమాయకత్వంతో రక్తి కట్టిస్తున్నాడు. ఆయన నాటకం అందరికి తెల్సిందే. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ పై 12 సార్లు రాజద్రోహం కేసును పెట్టడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడుకు రాజద్రోహం కేసు తెలియకుండానే పెట్టాడా అంటూ ప్రశ్నించారు. ఇటీవల కూడా గుంటూరుకు చెందిన లాయర్ లపై రాజద్రోహం కేసును చంద్రబాబు నాయుడు పెట్టించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రఘురామ కృష్ణం రాజు రాజద్రోహం కేసును గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ సజ్జల ఎద్దేవ చేశాడు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది