నిమ్మగడ్డ ప్లేస్ లో వచ్చే ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్ ఇతనేనా..?
samuel mylapalli : ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీలో ఎన్ని సంచలనాలు సృష్టించారో అందరికీ తెలుసు. ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోతోంది అంటే అర్థం చేసుకోవచ్చు… నిమ్మగడ్డ ఎంత ఫేమస్ అయ్యారో? ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ… ప్రభుత్వంపైనే హైకోర్టులో కేసులు వేసి.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన ఘనత నిమ్మగడ్డది. కానీ… ఆయన రిటైర్మెంట్ దగ్గర పడింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం… ఈనెల 31తో ముగియనుండటంతో…. తదుపరి రాబోయే ఎన్నికల కమిషనర్ ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

samuel mylapalli may be appointing as next ap cec
అయితే… కొత్త ఎన్నికల కమిషనర్ కోసం… గవర్నర్ కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ముగ్గురు పేర్లను సిఫారసు చేసింది. వాళ్లలో నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, మైలపల్లి శామ్యూల్ పేర్లను సిఫార్సు చేసింది.
సీఎం జగన్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్.. సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆ ముగ్గురి పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేశారు.
ప్రస్తుతం నీలం సాహ్ని… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, సీఎం జగన్ కు ప్రధాన సలహాదారుగా ఉన్నారు. అలాగే… మైలపల్లి శామ్యూల్… నవరత్నాల పర్యవేక్షణ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే.. ఏపీ పునర్విభజన చట్టం అమలు పర్యవేక్షణను రిటైర్డ్ ఆఫీసర్ ప్రేమ్ చంద్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
samuel mylapalli : శామ్యూల్ వైపు మొగ్గు చూపుతున్న సీఎం జగన్?
అయితే… సీఎం జగన్… మైలపల్లి శామ్యూల్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. నిమ్మగడ్డ వర్సెస్ వైఎస్ జగన్ అన్నట్టుగా పోరు సాగింది. చివరకు తన పంతం నెగ్గించుకొని మరీ.. నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించారు.

samuel mylapalli may be appointing as next ap cec