Congress – BRS : కాంగ్రెస్‌కి గుడ్ న్యూస్.. బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాకిచ్చిన ఎన్నికల కమిషన్
Congress – BRS : తెలంగాణ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. ఇంకో నెలన్నర అంతే.. నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు తెగ ఆరాటపడుతున్నాయి. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఈ మూడు పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. బరిలోకి దిగుతున్నాయి. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్నికల సంఘం బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయని అందరికీ తెలుసు కానీ.. డిసెంబర్ చివరి వారంలో లేదంటే జనవరి మొదటి వారంలో ఉంటాయి అని అంతా భావించారు. కానీ.. తెలంగాణలో నవంబర్ 30నే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడమే కాదు.. తక్షణమే ఎన్నికల కోడ్ ను కూడా అమలు చేసింది ఎన్నికల కమిషన్. దీంతో ఎలాంటి సంక్షేమ పథకాన్ని కానీ ప్రారంభించే అవకాశం లేదు. ఎలాంటి పథకాలను ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రకటించకూడదు. ప్రారంభించకూడదు. అలాగే.. ఎమ్మెల్యేలంతా కూడా ఎవ్వరూ అధికార వాహనాలను వినియోగించకూడదు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా నెలన్నర సమయమే ఉంది. అయితే.. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కొన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావించారు. ఇంకా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా ప్రారంభించాల్సి ఉంది. కానీ.. ఎన్నికల కోడ్ అమలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిలిపివేయాల్సి వస్తోంది. ఇది ఒకరకంగా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అనే చెప్పుకోవాలి.
Congress – BRS : బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ తెలంగాణలో దూకుడు మీద ఉంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కాస్త అనుకూల పవనాలే వీస్తున్నాయి. కొన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నా.. కొన్ని నేషనల్ సర్వేలు మాత్రం బీఆర్ఎస్ కే మళ్లీ పట్టం అని చెబుతున్నాయి. ఏది ఏమైనా.. ఎన్నికల కోడ్ అమలు మాత్రం బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి.