తెలంగాణ రాకుంటే.. ఆయనకు కేసీఆర్ విస్కీలో సోడా కలిపే అవకాశం వచ్చేది కాదుగా.. జగ్గారెడ్డి కామెంట్స్?
జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, తెలంగాణ రాజకీయాల గురించి పట్టున్న నేత. కాస్తో కూస్తో తెలంగాణ కాంగ్రెస్ లో గట్టిగా ఉన్న నేత అంటే జగ్గారెడ్డినే. ఈమధ్య టీపీసీసీ చీఫ్ పదవి కోసం కూడా బాగానే ట్రై చేశారు కానీ.. అది వర్కవుట్ కాలేదు.
అయితే.. ఇటీవల తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి… చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తెలంగాణ రాజకీయాల్లో అవి హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగానే స్పందించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈనేపథ్యంలోనే ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూపై సీబీఐ విచారణ చేస్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేస్తారా? తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ.. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పక్కకుపోయింది. ఇప్పుడు తెలంగాణలో చాలామంది చరిత్రహీనులు.. మంత్రులుగా చలామణి అవుతున్నారు.. అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
నెహ్రూ, ఉత్తమ్ లను విమర్శించే స్థాయి మీకు లేదు?
రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి.. పవర్ మంత్రి అయినప్పటికీ.. తన దగ్గర పవర్ లేదు. నెహ్రూ గురించి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి జగదీశ్ రెడ్డి.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పవర్ లేని మంత్రి కేసీఆర్ కు చెంచాలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టి… కేసీఆర్ విస్కీలో సోడా కలిపే అవకాశం వచ్చింది జగదీశ్ రెడ్డికి. లేకపోతే.. కనీసం ఆ అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు.. అంటూ జగ్గారెడ్డి.. జగదీశ్ రెడ్డిపై సెటైర్లు వేశారు.