Asia Cup 2025 | సంజూ శాంసన్ ఔట్.. ఆసియా కప్‌లో ఆడే భారత జట్టు ఇదే…!
Asia Cup 2025 | సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్ 2025కు భారత్ సిద్ధమవుతోంది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. యువతతో పాటు అనుభవజ్ఞుల సమ్మేళనంగా జట్టు రూపొందించబడింది. అయితే తుది ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందనే దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
#image_title
తుది జట్టు ఎలా ఉండే అవకాశముంది?
ఈసారి పోటీ తీవ్రంగా ఉండటంతో శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ వంటి ప్రముఖులు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఇదే సమయంలో సంజూ శాంసన్, శివమ్ దూబే, రింకూ సింగ్, హర్షిత్ రాణాలాంటి ఆటగాళ్లు కూడా తుది లెవెన్‌కి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్) బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్‌డౌన్‌లో తిలక్ వర్మ ఆడే అవకాశముంది. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తారు.
వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌లుగా వ్యవహరించనున్నారు. యూఏఈ పిచ్‌ల ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది. కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు తుది జట్టులో చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేస్ బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ద్వయం జట్టు కోసం నడుంకట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తుది జట్టులో చోటు దక్కించుకునే లక్ష్యంతో సంజూ శాంసన్ తన బ్యాటింగ్ పొజిషన్ మార్చుకోవచ్చు.