SBI : ఎస్బిఐ ఖాతాదారులకు శుభవార్త… ఇప్పటినుండి ఆ చార్జీలు మాఫీ… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

SBI : ఎస్బిఐ ఖాతాదారులకు శుభవార్త… ఇప్పటినుండి ఆ చార్జీలు మాఫీ…

SBI : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల ద్వారానే లావాదేవీలను పంపించుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే లావాదేవీలు ట్రాన్స్ఫర్ చేయడం, బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం ఇలాంటి వాటిపై బ్యాంకులు ఎస్ఎంఎస్ చార్జీలు విధిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎస్బిఐ ఎస్ఎంఎస్ చార్జీలు లేకుండా లావాదేవీలు జరిగేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతాదారులకు కొంచెం ఉపశమనం కలిగినట్లే. ఎస్బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 September 2022,7:30 am

SBI : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల ద్వారానే లావాదేవీలను పంపించుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే లావాదేవీలు ట్రాన్స్ఫర్ చేయడం, బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం ఇలాంటి వాటిపై బ్యాంకులు ఎస్ఎంఎస్ చార్జీలు విధిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎస్బిఐ ఎస్ఎంఎస్ చార్జీలు లేకుండా లావాదేవీలు జరిగేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతాదారులకు కొంచెం ఉపశమనం కలిగినట్లే. ఎస్బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మొబైల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే మనీ ట్రాన్స్ఫర్ పై వసూలు చేసే ఎస్ఎంఎస్ చార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. దీంతో ఇకపై మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా యూఎస్ఎస్డి సేవల్ని వినియోగించుకోవచ్చని ఎస్బిఐ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో *99# కు డయల్ చేసి బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఉచితంగా పొందవచ్చని తెలిపింది. మొబైల్ ఫండ్ ట్రాన్స్ఫర్ లపై ఎస్ఎంఎస్ చార్జీలు రద్దు చేయబడ్డాయి. వినియోగదారులు ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా సౌకర్యవంతంగా లావాదేవీలు జరుపుకోవచ్చని ట్వీట్ లో వెల్లడించింది. యుఎస్ఎస్డి అంటే అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అని అర్థం.

SBI offers free sms fee on mobile fund transfers

SBI offers free sms fee on mobile fund transfers

మొబైల్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేయడం బ్యాంక్ స్టేట్మెంట్ జనరేట్ చేయడంతో పాటు ఇతర సేవల్ని ఈ యుఎస్ డి ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఈ సర్వీస్ ఫీచర్ ఫోన్ల పై పని చేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వినియోగదారులు బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. *99# కోడ్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించడం ద్వారా స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా లావాదేవీల ట్రాన్స్ఫర్ లేదా అకౌంట్ స్టేట్మెంట్ తో పాటు ఇతర సేవలను వినియోగించుకునేందుకు యూజర్లకు ఎస్బిఐ అనుమతినిచ్చింది. ఎస్బిఐ కొత్త నిర్ణయంతో ఖాతాదారులకు కొంత ఉపశమనం కలగనుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది