SBI : అదిరిపోయే ప్రాఫిట్ అందిస్తున్న ఎస్ బిఐ… 5వేల పొదుపుతో 29 లక్షలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

SBI : అదిరిపోయే ప్రాఫిట్ అందిస్తున్న ఎస్ బిఐ… 5వేల పొదుపుతో 29 లక్షలు…

SBI : మార్కెట్లో ఒక్కసారే డబ్బులు పెట్టలేని వారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బును పొదుపు చేయవచ్చు. అయితే ఇవి ఒకే రకమైన రాబడిన అందించలేవు. కొన్ని ఫండ్స్ అదిరిపోయే ప్రాఫిట్ ను అందిస్తూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ రిస్కుకు లోబడి ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని ఫండ్స్ మాత్రం అదిరిపోయే పనితీరును కనబరిస్తున్నాయి. పొదుపు చేసిన వారి సంపదను అమాంతంగా పెంచేసాయి. ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్బిఐ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 September 2022,8:00 am

SBI : మార్కెట్లో ఒక్కసారే డబ్బులు పెట్టలేని వారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బును పొదుపు చేయవచ్చు. అయితే ఇవి ఒకే రకమైన రాబడిన అందించలేవు. కొన్ని ఫండ్స్ అదిరిపోయే ప్రాఫిట్ ను అందిస్తూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ రిస్కుకు లోబడి ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని ఫండ్స్ మాత్రం అదిరిపోయే పనితీరును కనబరిస్తున్నాయి. పొదుపు చేసిన వారి సంపదను అమాంతంగా పెంచేసాయి. ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్బిఐ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఒకటి. ఎస్బిఐ ఈ స్కీమ్ ను అందిస్తుంది. ఎంపీ డేటా ప్రకారం ఎస్బిఐ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గత పదేళ్ల కాలంలో 26% పైగా రాబడిని ఇచ్చింది.

మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ప్రకారం ఇన్వెస్టర్లు నెలకు 5000 ఈ ప్లాన్ లో పదేళ్ల కిందటి నుంచి పొదుపు చేసి ఉంటే ఇప్పుడు వారి ఇన్వెస్ట్మెంట్ విలువ ఏకంగా 29 లక్షలకు చేరి ఉండేది. అదే ఒకేసారి లక్ష పెట్టి ఉంటే మాత్రం ఇప్పుడు 10 లక్షల పైగా వచ్చేవి. ఎస్బిఐ స్మాల్ క్యాప్ ఫండ్ మూడేళ్ల పనితీరును గమనిస్తే 32 శాతం రాబడిని ఇచ్చింది. అలాగే డైరెక్ట్ ప్లాన్ అయితే 34% రాబడిని ఇచ్చింది. ఇవి రెండు సూపర్ ప్రాఫిట్స్ అని చెప్పుకోవచ్చు. సిప్ క్యాలిక్యులేటర్ ప్రకారం స్మాల్ క్యాప్ ఫండ్ లో మూడేళ్ల నుంచి 5000 వచ్చి ఉంటే ఇప్పుడు మూడు లక్షలకు పైగా వచ్చింది.

SBI small cap fund 5000 sip in this fund given 29 lakhs

SBI small cap fund 5000 sip in this fund given 29 lakhs

అలాగే ఒకేసారి లక్ష పెట్టి ఉంటే ఇప్పుడూ ఇన్వెస్ట్మెంట్ విలువ 1.5 లక్షలకు చేరి ఉండేది. ఈ స్కీం సెప్టెంబర్ 9, 2009లో మార్కెట్లోకి వచ్చింది. 2013 నుంచి ఈ ఫండ్ బాధ్యతలను ఆర్ శ్రీనివాసన్ చూసుకుంటూ వస్తున్నారు. ఈ ఫండ్ ఏయుఎం విలువ 14,044 కోట్లుగా ఉంది. స్మాల్ క్యాప్ కంపెనీలో ఈ ఫండ్ మీ డబ్బులను ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే ఇది హెవీ రిస్క్ తో కూడుకున్న ఫండ్స్. అందువల్ల వీటిలో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భారీ నష్టాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ముందే నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది