Chit Fund Finance : రాష్ట్రవ్యాప్తంగా చిట్‌ఫండ్ ఫైనాన్స్ కంపెనీలతో పాటు మార్గదర్శి పై సోదాలు..!
Chit Fund Finance ; తీవ్ర అక్రమాలు, ఉల్లంఘనలు ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు ప్రజల కష్టార్జితాన్ని దుర్వినియోగం చేస్తున్న చిట్‌ఫండ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ ఆదేశాలు 2016 లో మార్గదర్శికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన కేసు కొట్టివేయబడింది. అయితే 2020 లో కేసు హైకోర్టు తీర్పును ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో సవాలు చేసారు. నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఆరోపణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 19న సుప్రీంకోర్టు మార్గదర్శికి నోటీసులు అందించింది. అలానే ఫైనాన్షియర్లు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి అనుమతించింది.
అయితే ఇదే అంశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి మార్గదర్శిపై విచారణ జరిపించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలనూ కోరారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ అత్యున్నత ధర్మాసనంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది. తాజాగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఆధ్వర్యంలో పలు చిట్ ఫండ్ సంస్థల్లో సోదాలు నిర్వహించారు. గత నెలలోనే అక్టోబరు 21న 12 చిట్‌ఫండ్ కంపెనీల్లో, అక్టోబరు 31న చిట్‌ఫండ్ కంపెనీల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో వెలుగుచూసిన అంశాల ఆధారంగా తప్పిదాలకు పాల్పడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈమేరకు ఇవాళ రాష్ట్రం మొత్తం మార్గదర్శితో పాటు 18 చిట్ ఫండ్స్ కంపెనీలపై సోదాలు నిర్వహించారు.
అయితే ఈ సోదాల్లో పలు అంశాలు బయటకు వెలువడ్డాయి :
1) ప్రాథమిక విచారణ బట్టి 2021-22 బాలన్స్ షీటులో నగదు మల్లింపును గమనించారు. దానిపై పూర్తి విచారణ జరపనున్నారు
2) కంపెనీ ముందుస్తు సభ్యతా రుసుము వసూలు చేసి దానికి 5% వడ్డీని చెల్లించింది..
2) కంపెనీలు అడ్వాన్స్ సబ్‌స్క్రిప్షన్‌ని సేకరించాయి, దాని కోసం కంపెనీ సేకరించిన మొత్తానికి 5% వడ్డీని చెల్లించింది
3) చెల్లింపుకు సెక్యూరిటీని కంపెనీలు ఇవ్వలేదు (సెక్షన్ 31 ఉల్లంఘన)
4) చందాదారుడు ఆలస్యంగా కట్టిన వాయిదాలపై సేకరించిన అదనపు నగదు, ఒప్పంద ఉల్లంఘన, కలిగించిన నష్టాలు, జరిమానాలపై స్వీకరించిన నగదుపై GST చెల్లింపులు చేయలేదు