Shilajit benefits | శిలాజిత్ ఎందుకు ఫలితం చూపడం లేదు? .. ప్రజలు చేసే 3 పెద్ద తప్పులు!
Shilajit benefits | ఆయుర్వేదంలో శిలాజిత్‌ను “రసాయన” అని పిలుస్తారు. అంటే ఇది శరీరానికి శక్తివంతమైన టానిక్ అని అర్థం. ఇందులో ఫుల్విక్ ఆమ్లం, 80కి పైగా ఖనిజాలు ఉండటం వల్ల శరీరాన్ని పునరుజ్జీవింపజేయడమే కాకుండా అలసటను తగ్గిస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచి ఎముకలు, కీళ్లను బలపరుస్తుంది. వృద్ధాప్యాన్ని కూడా ఆలస్యం చేస్తుంది.

#image_title
శిలాజిత్ వాడడంలో సాధారణ తప్పులు
అయినా చాలామంది కొద్ది రోజుల వాడకంతోనే శిలాజిత్ ప్రయోజనాలను చూడలేక నిరాశ చెందుతున్నారు. నిపుణుల ప్రకారం, ఇది శిలాజిత్ ప్రభావం కాదని, ప్రజలు చేసే కొన్ని సాధారణ తప్పుల కారణంగా ఫలితం కనిపించడంలేదని చెబుతున్నారు. శిలాజిత్ వాడడంలో సాధారణ తప్పులు ఏంటంటే..
1 . అతిగా లేదా అసమయంగా వాడటం: త్వరగా బలం రావాలని ఎక్కువ మోతాదులో తీసుకోవడం లేదా మర్చిపోవడం వల్ల ప్రభావం తగ్గుతుంది. రోజుకు 300–500 mg మాత్రమే, క్రమం తప్పకుండా తీసుకోవాలి.
2. తప్పు పదార్థాలతో కలపడం: కొంతమంది శిలాజిత్‌ను టీ, కాఫీ లేదా ఆల్కహాల్‌తో కలిపి తాగుతారు. ఇవి దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి. సరైన పద్ధతి – గోరువెచ్చని పాలు, నీరు లేదా తేనెతో తీసుకోవడం.
3. ఓపిక లేకపోవడం: శిలాజిత్ తక్షణ ఫలితం ఇవ్వదు. కనీసం 6–8 వారాల తర్వాతే ప్రభావం కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో పూర్తి ఫలితాలకు 3–4 నెలల సమయం పడుతుంది.