Singareni Jobs : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. సింగరేణిలో 1900 పోస్టులకు నోటిఫికేషన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Singareni Jobs : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. సింగరేణిలో 1900 పోస్టులకు నోటిఫికేషన్..!

 Authored By tech | The Telugu News | Updated on :15 March 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Singareni Jobs : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. సింగరేణిలో 1900 పోస్టులకు నోటిఫికేషన్..!

Singareni Jobs : నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి నుండి మరో 1900 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. మొత్తం 1900 పోస్టులతో మరో నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుండి 30 సంవత్సరాల వరకు వయసు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే 10+2/ డిగ్రీ విద్యార్హతలు ఉండాలి. అప్పుడే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 35 వేల రూపాయల జీతం ప్రతినెల చెల్లించడం జరుగుతుంది.

ఈ ఏడాదిలో సింగరేణిలో దాదాపు 1900 ఉద్యోగాలను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వం సింగరేణిని నిర్లక్ష్యం చేసిందని, సంస్థను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో నిర్మించిన సింగరేణి గెస్ట్ హౌస్ కు ఇటీవల భట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని, సింగరేణి సంపదను పెంచడం పెంచిన సంపదను కార్మికులకు పంచడమే ధ్యేయంగా తమ పని చేస్తున్నామని తెలిపారు. గతవారం సింగరేణిలో 489 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. మరో 1352 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. సింగరేణిలో ఎస్పీ, ఎస్టీ లైజనింగ్ ఆఫీసర్ల తరహాలో బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నట్లు అన్నారు.

దరఖాస్తు పెట్టుకున్న తర్వాత అందరికీ ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్లో సంబంధిత ప్రభుత్వ సంస్థ వారు పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఈ పరీక్షలకు సంబంధించిన తేదీలను వెల్లడించలేదు. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను కరెక్ట్గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. సిలబస్ పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారో వివరించలేదు. కానీ త్వరలో 1900 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ప్రకటించడం జరిగింది. సింగరేణి సంస్థను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పినా ఆయన త్వరలోనే 1900 పోస్టులు తో మరో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది