ఈ ఘటన బెంగళూరులో జరిగింది. లక్ష్మమ్మ అనే ఆమెకు మంజునాథన్ అనే ఒక కొడుకు ఉన్నాడు.అతడికి రష్మీ అనే యువతితో పెళ్లి అయింది. పెద్దలకు కుదిర్చిన సంబంధం కావడంతో ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఇక లక్ష్మమ్మ కూడా కోడలను బాగానే చూసుకునేది. అయితే వీరి మొదటి అంతస్తులో అక్షయ్, రాఘవేంద్ర అనే ఇద్దరు యువకులు అద్దెకు ఉండేవారు. అందులో అక్షయ్ ఖాళీగా ఉండేవాడు. రాఘవేంద్ర ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అయితే ఇంట్లో ఉన్న అక్షయ్ కళ్ళు రష్మి మీద పడ్డాయి. రష్మీ బట్టలు పైన వేయడానికి వచ్చినప్పుడు ఆమెతో మాటలు కలిపేవాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి. అది అక్రమ సంబంధానికి దారి తీసింది. అత్త బయటకి వెళితే చాలు ఒంటరిగా ఉన్న అక్షయ్ దగ్గరకు రష్మీ వెళ్ళేది. అయితే ఇది గమనించిన రాఘవేంద్ర ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని వారించాడు.
అయినా అతడు వినలేదు. ఓ రోజు లక్ష్మమ్మ ఇంటికి ఎదురుగా ఉన్న స్నేహితురాలి ఇంటి పై అంతస్తుకు వెళ్ళింది. అయితే అక్కడ కోడలు స్నానం చేసి అక్షయ్ దగ్గరికి వెళ్లడం ఎదురింట్లో ఉండి లక్ష్మమ్మ చూసింది దీంతో లక్ష్మమ్మ ప్రాణం ఆగిపోయినట్లు అయింది. వెంటనే ఇంటికి వెళ్లి రశ్మి తో గొడవ పెట్టుకుంది. నా కొడుకుకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని బెదిరించింది. ఇక అక్షయ్ ఇల్లును ఖాళీ చేయమని లక్ష్మమ్మ చెప్పింది. దీంతో అక్షయ్ ఇంత సడన్గా ఎలా ఖాళీ చేస్తాం, రెండు నెలలు టైం ఇవ్వండి అని చెప్పాడు. అలా రష్మీ వారం పాటు ప్రియుడికి దూరంగా ఉంది. అయితే ఓ రోజు ఫోన్లో అత్తను చంపితే మనకు అడ్డు ఎవరూ ఉండరు అని చెప్పింది. దీంతో అలవాటు పడిన అక్షయ్ సరే అన్నాడు.
అయితే ఓ రోజు భర్త ఆఫీస్ కి వెళ్ళగానే రష్మి బ్రేక్ ఫాస్ట్ లో మత్తు మాత్రలు కలిపి లక్ష్మమ్మకి పెట్టింది. దీంతో లక్ష్మమ్మ నిద్రలోకి జారుకుంది. వెంటనే ప్రియుడికి ఫోన్ చేసి చెప్పడంతో అతడు వచ్చి లక్ష్మమ్మ మెడకు ఉరేసాడు. గాట్లు పడితే అనుమానం వస్తుందని రష్మీ దిండును మెడకు చుట్టింది. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి అత్తమ్మకు నిద్రలో హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిందని కంగారుగా చెప్పింది. దీంతో మంజునాథన్ ఒకసారి గా షాక్ అయ్యాడు. ఆ తర్వాత బంధువులంతా వచ్చి అంతక్రియలు జరిపించారు. అయితే అక్షయ్ మీద రాఘవేంద్ర కి అనుమానం వచ్చింది. వెంటనే తన అతడి ఫోన్ ని చెక్ చేశాడు. అందులో రష్మీ అక్షయ్ చేసుకున్న చాటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే మంజునాథన్ కి చెప్పి పోలీసులకు చెప్పమన్నాడు. దీంతో పోలీసులు రష్మీ అక్షయ్ లను విచారణ చేపట్టారు. వీరిద్దరే చంపారని క్లారిటీ రావడంతో అరెస్టు చేశారు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.