
Sleep Paralysis : మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు... ఎవరైనా మీ చాతి పైన కూర్చున్నట్లు అనిపిస్తుందా... అయితే, ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి...?
Sleep Paralysis : ఇది అందరిలోనూ జరిగే చాలా సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎదుర్కొని ఉంటారు. కానీ దానికి పూర్తి అర్థం ఏమిటి అనేది తెలియదు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం అస్సలు తెలియదు. అర్ధరాత్రి పూట గాడ నిద్రలో ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున కొందరికి పీడకలు వస్తూ ఉంటాయి. ఆ కలలలో ఒక్కోసారి దయ్యం ఏదో వచ్చి ఛాతి మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఎటు కదల్లేని పరిస్థితి, మాటలు కూడా రావు.దీన్ని స్లీప్ పరాలసిస్ అని కూడా అంటారు. ప్రతి ఒక్కరికి కూడా రాత్రి నిద్రించేటప్పుడు పీడకలు రావడం అనేది సర్వసాధారణమే. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కోసారి గుండెపై ఎవరో కూర్చున్నట్లు, పీక నులుముతున్నట్లు అనిపిస్తుంది. అరవాలంటే మాట కూడా పెగలదు. అరుస్తున్నట్లే అనిపిస్తుంది కానీ ఆ మాట ఎవరికీ వినిపించదు. అటు ఇటు కదులుదామంటే కదలనివ్వదు. చాలా భయంగా అనిపిస్తుంది.
Sleep Paralysis : మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు… ఎవరైనా మీ చాతి పైన కూర్చున్నట్లు అనిపిస్తుందా… అయితే, ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి…?
ఎల్లారాక దయ్యం గుండెలపై కూర్చుని హింసించిందని రకరకాలుగా చెప్పుకొని భయాందోళనలకు గురవుతుంటారు.ఇది నిజంగా జరిగిందేమో అన్నట్లే అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూసిన మన గుండెలపై దయ్యం కూర్చొని పీక నులుముతుంది అన్నట్లు కూడా అనిపిస్తుంది. దయ్యాన్ని రియల్ గా చూసిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంటి సమస్య మీకు ఎప్పుడైనా ఎదురైందా.. ఇలాంటి పరిస్థితి ఎదురైతే దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ఇది నిజంగా దెయ్యమా లేదా ఇంకా ఏదో అనుకుంటున్నారా… అది దయ్యమని అనుకుంటే పొరపాటే. ఇంకేదో కాదు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇలా అందరికీ జరుగుతుంది. దీనిని స్లీప్ పెరాలసిస్ అంటారు. అంటే, నిద్ర సమయంలో కొన్ని క్షణాల పాటు శరీరం అంతా కూడా పక్షవాతానికి గురవుతుందన్నమాట. ఇది అందరికీ జరుగుతుంది. అయితే, ఇది కేవలం ఒకటి రెండు నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున నిద్రలేచే సమయానికి ఇలా జరుగుతుంది. నిద్రలో ఏదైనా కల వచ్చే సమయంలోనే ఇలా స్లీప్ పెరాలసిస్ కూడా వస్తుంటుంది. అందరికీ మిట్ట మధ్యాహ్నం నిద్రపోతున్నప్పుడు, ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో కూడా అలా జరుగుతుంది. ఇంట్లో ఎవరూ లేరు అన్న ఫీలింగ్ తో నిద్రిస్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం సమయంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు, కొందరికి ఇలాంటి సంఘటన ఎదురవుతుంది.
స్లీప్ పెరాలసిస్ వచ్చిన తర్వాత కొన్ని సెకండ్లలో మెలుకు వస్తుంది. మెలుకు వచ్చిన మరుక్షణం కళ్ళు తెరిచి చూస్తే అంత మామూలుగానే ఉంటుంది. అయితే ఇక్కడ నిద్రపోయినప్పుడు ఏం జరిగిందో మాత్రం గుర్తుంటుంది. గుండెలపై దయ్యం కూర్చున్నట్లు అనిపించిన సంఘటన మెలకువతో ఉన్నట్లుగానే గుర్తుంటుంది. కానీ అది దయ్యమా ఏమిటా అనేది అంత స్పష్టంగా తెలియదు. దెయ్యం తన గుండెల పై కూర్చొని గొంతు నునుముతున్నట్లు తనను హింసిస్తున్నట్లు భావన కలుగుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, స్పృహలో ఉన్నప్పటికీ కథనలేని అనుభూతి చెందడానికి,స్లీప్ పెరాలసిసే కారణమని చెబుతున్నారు నిపుణులు.
స్లీప్ పెరాలసిస్ కి అర్థం ఏమిటి : నిద్రను నియంత్రించడం వల్ల మెదడులో సమస్య తలెత్తడానికి నార్కో లెక్సీ అంటారు. స్లీప్ పక్షవాతం సాధారణంగా ఒకటి రెండు సార్లు మాత్రమే సంభవిస్తుంది. నిద్రలో ఇది సంభవిస్తే దానిని కిత్నా గోజిక్ లేదా ఫ్రీడార్మిటల్ స్లీప్ పెరాలసిస్ అంటారు. మెలకువగా ఉన్న సమయంలో జరిగితే దానికి ఫోన్ పిక్ లేదా పోస్ట్ డోర్ మిట్టల్ స్లీప్ పెరాలసిస్ అంటారు. నూటికి 90% మందికి నిద్రలోని ఈ సమస్య వస్తుంది ఇలా జరగకుండా ఉండాలంటే కమ్మటి సువాసనలు వెదజల్లే రెండు మూడు ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలను దిండుపై వేస్తే చక్కగా నిద్రపోతారు. అయినా నిద్ర పట్టకపోతే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇది పక్షవాతం లాంటిది, కాబట్టి దెయ్యం మన గుండెలపై కూర్చున్నట్లు అనిపించినప్పుడు, అందుకే ఎటు కదల్లేని పరిస్థితి అనిపిస్తుంది.ఈ పక్షవాతం అనేది నిద్రలో మాత్రమే వస్తుంది. మెలుకువతో ఉన్నప్పుడు దీని ప్రభావం ఉండదు. దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ,ఈ సమస్య పదేపదే వస్తే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించి వారి సలహాలను తీసుకోవడం ఉత్తమం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.