Smart Phones : మంచి ఫీచర్స్‌తో రూ. 20 వేల లోపు ఫోన్స్.. పోటాపోటీగా రెండు ఫోన్స్
Smart Phones : ప్రస్తుతం మార్కెట్‌లో మంచి ఫీచర్స్‌తో తక్కువ ధరకే ఫోన్స్ లభిస్తున్నాయి. కంపెనీలు మంచి మంచి ఆఫర్స్‌తో వినియోగదారుడిని ఆకర్షించే ప్రయత్నించే క్రమంలో మార్కెట్‌లో వినూత్నమైన ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రూ.20వేలలోపు 5జీ మొబైళ్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇదే సెగ్మెంట్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం33 5జీ , పోకో ఎక్స్4 ప్రో 5జీ వచ్చేశాయి. స్పెసిఫికేషన్లలో ఈ రెండు మొబైళ్లు పోటాపోటీగా ఉన్నాయి. సామ్‌సంగ్ మొబైల్ ఎగ్జినోస్ ప్రాసెసర్‌తో వస్తుండగా.. పోకో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.సామ్‌సంగ్ మొబైల్‌లో ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉండగా..
పోకో ఎక్స్4 ప్రో 5జీ అధిక ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో లాంచ్ అయింది.సామ్‌సంగ్ ఎం33 5జీ వెనుక నాలుగు కెమెరాల సెటప్‌తో ఉంది. రెండు మొబైళ్లు 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న హెచ్‌డీ+ డిస్‌ప్లేలతో వస్తున్నాయి. మొత్తంగా సామ్ సంగ్ గెలాక్సీ M33 5G, Poco X4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.సామ్‌సంగ్ గెలాక్సీ ఎం33 5జీ విషయానికి వస్తే.. డిస్‌ప్లే- 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ గా ఉంటుంది.
Smart Phones : ఊహించని ఫీచర్స్‌తో…
ప్రాసెసర్ సామ్‌సంగ్ ఎగ్జినోస్ 1280 ఎస్ఓసీ (Exynos 1280), మాలీ జీ-68 జీపీయూ, వెనుక కెమెరాలు 50MP ప్రధాన + 5MP అల్ట్రావైడ్ + 2MP డెప్త్ + 2MP మాక్రో,ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1, బ్యాటరీ 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్,వేరియంట్లు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ + 128జీబీ, ప్రారంభ ధర రూ.17,999గా ఉంది.పోకో ఎక్స్4 ప్రో 5జీ విషయానికి వస్తే.. 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డాట్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ డిస్ ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 , అడ్రెనో 619 జీపీయూ ప్రాసెసర్, 64MP ప్రధాన + 8MP అల్ట్రా వైడ్ + 2MP మాక్రో బ్యాక్ కెమెరాస్, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ బ్యాటరీ, 6జీబీ + 64జీబీ, 6జీబీ + 128జీబీ, 8జీబీ + 128జీబీ వేరియెంట్స్, ప్రారంభం ధర రూ.18,999 గా ఉంది.