SmartPhone : బీ అలర్ట్.. స్మార్ట్ ఫోన్స్ నైట్ టైమ్స్‌లో చూస్తే ఆ డిసీజ్ గ్యారెంటీ..!
Smart Phones : ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో బోలెడన్ని మార్పులు వచ్చాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మొబైల్ ఫోన్ అనే డివైజ్ పది మందిలో ఒకరిద్దరికి ఉండేవి. కానీ, ఇప్పుడు అలా కాదు. ఒక్కరికి రెండు లేదా మూడు ఫోన్స్ ఉంటున్నాయి. అవి కూడా స్మార్ట్ ఫోన్స్ అవుతుండటం గమనార్హం. స్మార్ట్ ఫోన్ ద్వారా టెక్నాలజీస్ ప్రతీ ఒక్క పని సులభతరమవుతున్నది. మానవుడి శారీరక శ్రమను కంప్లీట్‌గా తగ్గించేస్తున్నాయి స్మార్ట్ ఫోన్స్. అయితే, ఏదైనా అతిగా వాడితే చెడు జరగుతుందన్న సంగతి తెలిసిందే. అలా స్మార్ట్ ఫోన్స్ నైట్ పూట అతిగా వాడితే ఆ డిసీజ్ వస్తుందట.
స్మార్ట్ ఫోన్ రాత్రి వేళల్లో అతిగా చూసినట్లయితే కంటి సమస్యలు వస్తాయని అందరికీ తెలుసు. కాగా, కంటి సమస్యలతో పాటు మరి కొన్ని సమస్యలు వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. నైట్ టైమ్స్‌లో బ్లూ కలర్ లైట్ చూడటం వలన వారికి స్వీట్ ఫుడ్ ఎక్కువగా తినాలని అనిపిస్తుంది. అలా వారికి ఊబకాయంతో పాటు షుగర్ వచ్చే చాన్సెస్ ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. స్ట్రాస్‌బర్గ్ యూనివర్సిటీ, ఆమ్‌స్టర్‌డామ్ యూనివర్సిటీ సైంటిస్ట్స్ పరిశోధన తర్వాత ఈ విషయాలు తెలిపారు.

smartphone be alert dont use smart phones in night times
Smart Phones : రాత్రిళ్లు స్మార్ట్ ఫోన్ వాడితో కంటి సమస్యలతో పాటు మరి కొన్ని సమస్యలు..
రాత్రి సమయాల్లో స్మార్ట్ ఫోన్స్ చూస్తే ఏమవుతుందనే విషయమై వీరు ఎలుకలపై పరిశోధన చేశారు. వాటిని కొంత కాలం పాటు బ్లూ లైట్ అనగా స్మార్ట్ ఫోన్ లైట్స్‌లో ఉంచి రీసెర్చ్ చేసి ఆసక్తికర విషయాలు కనుగొన్నారు. నైట్ టైమ్స్‌లో మనుషులు ఎక్కువగా ఫోన్ చూస్తే షుగర్ డిసీజ్ వచ్చే చాన్సెస్ చాలా ఉన్నాయని ఈ క్రమంలోనే పరిశోధకులు, నిపుణులు చెప్తున్నారు. కాబట్టి నైట్ టైమ్స్‌లో స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేప్పుడు ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాంతి నేరుగా కళ్లపైన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.