Snake Gourd | పొట్లకాయలో ఆరోగ్య రహస్యాలు .. క్యాన్సర్‌కు బ్రేక్, గుండెకు గార్డియన్, జుట్టుకు సంజీవని!
Snake Gourd | మనం సాధారణంగా వంటలలో ఉపయోగించే పొట్లకాయ (Snake Gourd) కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్య పరిరక్షకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తరచూ తినడం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుందట. క్యాన్సర్‌తో సహా గుండె జబ్బులు, జ్వరం, జుట్టు సమస్యల నుంచి ఈ కూరగాయ అద్భుత రక్షణను అందిస్తుంది.
#image_title
పొట్లకాయలోని ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే:
1. క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది
పొట్లకాయలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు & ఫైటోకెమికల్స్ శరీరంలోని హానికరమైన కణాల అభివృద్ధిని అడ్డుకుంటాయి. దీనివల్ల క్యాన్సర్ ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.
2. కీళ్ల నొప్పులకు ఉపశమనం
ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలున్నవారికి ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది. వాపులు, నొప్పులు తగ్గిస్తుందట.
3. గుండె ఆరోగ్యానికి మేలైన మిత్రుడు
పొట్లకాయలో అధికంగా ఉండే కాల్షియం గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, హార్ట్ అటాక్‌కు అడ్డు నిలుస్తుంది. రోజూ 30 మిల్లీలీటర్లు పొట్లకాయ రసం తాగితే గుండె పనితీరు మెరుగవుతుంది.
4. జ్వరం, కామెర్లకు చికిత్సగా ఉపయోగించవచ్చు
పొట్లకాయలో ఉన్న ఫైటోన్యూట్రియెంట్లు జ్వరాన్ని తగ్గించగలవు. కామెర్లకు ధనియాతో కలిపి తింటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఆకులను శరీరంపై రుద్దినా ఉపశమనం లభిస్తుందట.
5. రోగనిరోధక శక్తి పెరుగుతుంది
కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. హైబీపీ, ఛాతి నొప్పులు వంటి సమస్యలలో ఇది సహాయకారి.