Health Tips : నిద్రలేని వారికి ఇదో మంచి మెడిసిన్.. ఒక గ్లాసు తాగితే చాలు
Health Tips : ప్రస్తుతం మారిన జనరేషన్, లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో నిద్రలేమి సైతం ఒకటి. రాత్రి సమయాల్లో డ్యూటీ చేయడం లేదా ఎక్కువగా ఆలోచించడం వర్క్ స్ట్రెస్ వల్ల చాలా మందిని నిద్రలేమి వేధిస్తోంది. దీనికి తోడుగా పడుకునే సమయంలో చాలా మంది ఫోన్ తోనే టైంపాస్ చేస్తారు. దీని వల్ల నిద్ర రాదు. ఫలితంగా సమయానికి నిద్రపోరు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. నిద్రలేమి సమస్యలను దూరం చేసేందుకు ఆయుర్వేదంలో మంచి చికిత్స ఉంది. దీనికి ఏవో మందులు వాడాల్సిన పనిలేదు.
కొన్ని పదార్థాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడమే.పొట్టకాయ గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ చాలా మంది దీనిని తినేందుకు ఇష్టపడరు. కానీ దీనిలోని పోషక విలువులు తెలుసుకున్న తర్వాత దీనిని వదలిపెట్టరు. పురాతన కాలం నుంచి పొట్లకాయను వంటకాల్లోనూ, వాటి ఆకులను ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్ల మేటరీ ఎక్కువగా ఉంటుంది. జ్వరాలు, కామెర్ల వంటి అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు గుండె జబ్బులను నమయం చేసేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది. పొట్ల కాయ రసంతో విటమిన్ బీ6 లేదా పిరిడాక్సిన్ కంటెంట్ మెదడు పనితీరును పర్యవేక్షించడంలో, నరాలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.

Health Tips in uses for snake gourd
Health Tips : వీటితో చాలా ఉపయోగం
నిద్రలేమి ఉన్న సమయంలో పొట్లకాయ రసాన్ని ఒక గ్లాసు తీసుకోవడం వల్ల న్యూరోట్రాన్స్ మిట్ల కార్యకలాపాలు దగ్గుతాయి. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది. దీనితో పాటుగా థైరాయిడ్ సమస్యను ఇది నియంత్రిస్తుంది. బాడీలో రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. కీళ్ల వ్యాధులను తగ్గిస్తుంది. జాండిస్ వంటి వ్యాధులతోనూ పోరాడుతుంది. జ్వరాలను, గుండె జబ్బులను సైతం నివారిస్తుంది. దీని వల్ల ఇవే కాకుండా మరెన్నో లాభాలున్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.