janasena president pawan kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు ఏ స్థాయిలో అభిమానిస్తారో అదే స్థాయిలో కొందరు యాంటీ ఫ్యాన్స్ ఇంకా ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు వారిని ఎంతగా టార్గెట్ చేసి పవన్ కి మద్దతుగా నిలిచినా వారి కామెంట్స్ మరియు వారి యొక్క విమర్శలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ యొక్క యాంటీ ఫ్యాన్స్ మళ్లీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. ఎన్నో అంచనాల నడుమ జనసేన పార్టీని ఆరంభించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోతున్నాడు, అలాగే సినిమాలకు సరైన సమయం కేటాయించలేక విఫలం అవుతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెంటికి చెడ్డ రేవడు అన్నట్లుగా మారిపోయాడని సినిమాల్లో ఉండి ఉంటే ఆయన ఏడాదికి 100 కోట్ల రూపాయలను సంపాదించేవాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ అభిమానులు గట్టి సమాధానం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ డబ్బు సంపాదన లక్ష్యంగా అనుకుంటే వందల కోట్ల డబ్బు సంపాదన దక్కించుకోవచ్చు. పార్టీ పెట్టి కూడా సాధించవచ్చు కానీ డబ్బు లక్ష్యంగా ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. ఒక వేళ అలా అనుకుని రాజకీయాల్లో అడుగు పెడితే ఆయన గత ఎన్నికల్లోనే విజయాన్ని సొంతం చేసుకునేవారు. ఆయనకు డబ్బు ప్రాముఖ్యత కాదు, అధికారం అస్సలు ప్రాముఖ్యత కాదు.. సినిమాల్లో హీరోగా తాను సక్సెస్ అవ్వాలి అని అనుకోడు.
social media trolls on pawan kalyan politics and movies
కేవలం సామాన్య జనాలకు తాను ఎంతో కొంత ఉపయోగపడాలి. వారి కోసం ఏదో ఒకటి చేయాలి అనుకుని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాడు. అంతే తప్ప డబ్బు సంపాదన సినిమాల్లో స్టార్డం ఇంకేదో ఇంకేదో ఆయనకి అస్సలు అక్కరలేదు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పార్టీ విజయాన్ని సాధిస్తుంది.. అలాగే రాబోయే ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ నుండి రెండు మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అవ్వబోతున్నాయి. కనుక పవన్ కళ్యాణ్ ఎలా రెంటికి చెడ్డ రేవడు అవుతాడు అంటూ కొందరు పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇష్టానుసారంగా పవన్ గురించి మాట్లాడి బుద్ధి తక్కువ పనులు చేయవద్దంటూ యాంటీ ఫ్యాన్స్ కి పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.