Software : సాఫ్ట్ వేర్ అంటే ఎంతో మొత్తం చెప్పేసిన ఉద్యోగి.. నమ్మలేని నిజాలు తెలిస్తే షాక్
Software : సాఫ్ట్ వేర్ అనుకున్నంత సాఫ్ట్ గా ఉండదని.. ప్రెషర్ తో ఏసీలో కూడా చెమటలు పడతాయని అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ వాళ్లు చెబుతుంటే వినే ఉంటాం.. లక్షల్లో జీతం.. వికెండ్ పబ్బుల్లో పార్టీలు.. లైఫ్ బిందాస్ వాడికేంట్రా.. అనుకుంటారు చాలామంది. గుడ్డు పెట్టే కోడికే తెలుసు దాని నొప్పేంటో అన్నట్లు వాళ్ల కష్టాలు ఏంటో వాళ్లకే తెలుసు.. సాఫ్ట్ వేర్ గురించి ప్రస్తుతం ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మరో వ్యక్తి సమాధానం ఇచ్చాడు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనగానే లక్షల్లో జీతం, ఏసీ రూమ్స్ లో పని, వీకెండ్ రెండు సెలవులు.. హాయిగా ఉంటారు అనుకుంటారు. కేవలం ఇది మాత్రమే గొప్ప ఉద్యోగం అనే భావన ఎందుకు కలుగుతుంది అనే ప్రశ్నని కోరాలో ఒక యూజర్ పోస్ట్ చేశారు. దీనికి సుధీర్ వర్మ అనే మరొక యూజర్ ఇచ్చిన సమాధానం వాళ్ల ఆవేదన ఎంటో తెలియజేసింది. ఒక మాజీ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా తన ఇంట్లో జరిగిన విషయం.. తనకు తెలిసిన విషయం ఇలా చెప్పుకొచ్చాడు. మా పెదనాన్న గారికి ఇద్దరు కొడుకులు. పెద్దన్నయ్య నాలానే సాఫ్ట్ వేర్. రెండో అన్నయ్య ఎయిర్ ఫోర్స్ లో రేడియో టెక్నాలజీ డిపార్టుమెంట్.
Software : సాఫ్ట్ వేర్ సుఖమని..
అయితే పెద్దోడికి సుఖం హాయిగా ఏసీలో కుర్చుని నెలకి లక్ష సంపాదిస్తాడని ఇంట్లో, బయట అందరు అనుకునేవారు. అలాగే చిన్నోడు పాపం ఉద్యోగం పేరుతో ఊరూరు ట్రాన్స్ ఫర్ అంటూ తిరుగుతాడు అనుకునేవారు. కానీ.. పెద్దోడు ఈ రోజుకి సంపాదించి దాచింది ఏమి లేదు. అదే చిన్నోడు పొలం కొనుక్కుని కొంత డబ్బు సేవ్ చేసి రిటైర్ అయ్యాక కూడా మంచి ఉద్యోగం సంపాదించగలడు. అయితే కరోనా వల్ల పెద్దోడు హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి పని చేసుకున్నాడు. పేరుకి పెద్ద కంపెనీలో మేనేజర్. లక్షకు పైగా జీతం.. అందుదలో చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ కి ఒక్కడే లీడ్ చేసేవాడు.
Software : గదిలోకి వెళ్లినవాడు ఎప్పుడొస్తాడో..
ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది పెద్దడి రిస్క్ ఎంటో.. వాడు ఏమి కోల్పోతున్నాడో.. పొద్దున్న తొమ్మిదికి గదిలోకి వెళ్లి ఏ అర్ధరాత్రో బయటకి వస్తాడు. టైమ్ ఉంటే ఫుడ్ లేకుంటే అంతే సంగతీ.. ఒక పక్క పని, మరొకపక్క మీటింగ్స్, డెలివరీ, ఎస్కలేషన్స్, అప్డేట్స్ ఇలానే ఏడాది గడిచిపోయింది. అప్పుడు పెదనాన్న.. ఇన్ని రోజులు ఏమో అనుకున్నా కానీ వీడు పాపం చాలా కష్ట పడుతున్నాడు.. అన్నాడు. అంతేకాకుండా చిన్నన్నయ్య ఉద్యోగమే బెటర్ వీడికంటే పాపం అనేశారు అందరూ…
అయితే ఎంత ఏసీలో కూర్చున్నా.. లక్షల జీతం వచ్చినా.. జీతానికి పదిరెట్లు పని చేయించుకుంటాయి కంపెనీలు. ఎక్కడి నుండి అయినా పని చేయాల్సిందే. సాయంత్రానికి పని అయిపోవాల్సిందే… ఇదే మా ఫార్ములా.. వీకెండ్, పబ్, ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నందుకు తాయిలాలు మాత్రమే. ఎంత ఏసీ గదుల్లో కూర్చున్నా వర్క్ టెన్షన్ కి చెమటలు పడుతుంటాయి.. అని చెప్పుకొచ్చాడు.