అతను ఒ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి… నేను మోనార్క్‌ని నన్ను ఎవరూ మోసం చేయలేరన్నది ఆయన ఓవర్ కాఫ్పిడెన్స్…. చివరికి ఏంజరిగిందంటే..?
హైదరాబాద్: అతనొక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతనికి అన్నీ తెలుసనే ఓవర్ కాఫ్పిడెన్స్… సైమర్ మోసగాళ్లు చేసే మోసాలగురించి మంచి అవగాహన ఉది. ఒక రోజు తనకు ఓ మెసేజ్ వచ్చింది. అందులో 20 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టండి కొన్ని రోజుల తర్వాత 6200 లాభం పొందండి అమెసేజ్‌ను పట్టించుకోలేదు. మరొక రోజు తనకు అదే మెసేజ్ వాట్సాప్‌లో రావడంతో అందులో ఉన్న నంబర్‌కి కాల్ చేశాడు. నేరగాడు అది ఒక బిజినెస్‌లాంటిదని ఇందులో డబ్బులు పెట్టుబడిగా పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపాడు.
మొదటగా అది నమ్మని ఉద్యోగి ఆ కాల్ ను కూడా పట్టించుకోలేదు. కానీ తనకు వచ్చే జీతం సరిపోక పోవడంతో అందులో ఇన్వెస్ట్ చేద్దామని మోసగాడు చెప్పిన పేజీలో మొదటగా 20 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. మోసగాడు చెప్పినట్టుగానే 20 వేలకు 6200 రూపాయలు లాభం వచ్చినట్టు కనిపించింది. ఆ ఉద్యోగి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.
మరో రెండు సార్లు ఇలానే 20 వేల చొప్పున ఇన్వెన్ట్ చేయగా రెడు సార్లు లాభం వచ్చినట్టు పేజీలో కనిపించింది. ఇదేదో బానే ఉందనుకొని ఈ సారి భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేద్దామని 8 లక్షల రూపాయలు అప్పుచేసిమరీ పేజీలో ఇన్వెస్ట్ చేశాడు. ఈ సారి కూడా లాభం వచ్చినట్లు పేజీలో చూపించింది. ఆ నగదు మొత్తాన్ని విత్‌డ్రావల్ చేద్దామని ప్రయత్నించగా అందులో విత్‌డ్రావల్ ఆప్షన్ కనిపించకపోవడంతో తన దగ్గరున్న నంబర్‌కి కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గుర్తించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.