కామంతో రగిలిపోయిన తమ్ముడిని కాపాడే ప్రక్రియలో అన్న బలైపోయాడు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

కామంతో రగిలిపోయిన తమ్ముడిని కాపాడే ప్రక్రియలో అన్న బలైపోయాడు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :6 April 2023,1:00 pm

ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు ఉన్న కొద్ది పెరిగిపోతున్నయి. వావివరసలు లేకుండా ఎవరికి వారు శరీర సుఖాల కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. దీంతో భారతదేశంలో అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న చాలా గొడవలకు ప్రధాన కారణం అక్రమ సంబంధాలు అని క్రైమ్ లెక్కలు చెబుతున్నాయి. దీంతో కొంతమంది ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటువంటి పరిణామాలలో అమాయకులు కూడా బలైపోతున్నారు. తాజాగా ఈ తరహాలో తిరుపతి జిల్లా చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చేతిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య చేయబడ్డాడు. అక్రమ సంబంధం విషయంలో తమ్ముడు గొడవని సెటిల్ చేద్దామని వెళ్లిన అన్నయ్యని

Software Engineer Nagraju Case

Software Engineer Nagraju Case

టీడీపీ సర్పంచ్ దారుణంగా చంపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే నాగరాజు, పురుషోత్తం ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములు బెంగళూరులోని ప్రముఖ కంపెనీలలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఈ ఇద్దరూ బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వాళ్లు. అయితే అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చాణిక్య ప్రతాప్ తమ్ముడు రుపుంజయ భార్యతో… అన్నదమ్ములలో ఒకరైన పురుషోత్తం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ విషయం రుపుంజయకి తెలియటంతో ఎలాగైనా పురుషోత్తం నీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన తమ్ముడిని చంపాలని తెలుగుదేశం పార్టీ సర్పంచ్ తమ్ముడు వ్యూహాలు వేస్తున్నట్లు తెలుసుకున్న అన్న నాగరాజు… తమ్ముడు పురుషోత్తం నీ బెంగళూరుకి పంపించేశాడు. దీంతో తెలుగు దేశం పార్టీ సర్పంచ్ చాణిక్య ప్రతాప్, రుపుంజయ…

నాగరాజు కుటుంబం పై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. అన్న నాగరాజుకు చెందిన పొలాల దగ్గర పైపులు పగలగొట్టడం… చెట్లు నరికేయటం మోటార్లను కాల్చి వేయడం వంటివి తెలుగుదేశం పార్టీ నేతలు చేయడం జరిగింది. ఈ క్రమంలో వివాదం పరిష్కరించుకుందాం రమ్మని నాగరాజుని స్వగ్రామం బ్రాహ్మణపల్లికి రుపుంజయ.. అతని అనుచరులు రమ్మనడంతో కారులో వెళ్లిన నాగరాజుని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాగరాజు హత్య కేసులో రామచంద్రాపురం మండలానికి చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉన్నట్లు.. పోలీసులు గుర్తించి విచారణ చేపడుతున్నారు. మృతుడు నాగరాజు భార్య మధుమతి ఫిర్యాదు మేరకు చాణిక్య ప్రతాప్, రుపుంజయ, గోపి, సుబ్రహ్మణ్యం తో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేయడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది