Marriage : తల్లికి రెండో పెళ్లి చేసిన ఓ కొడుకు .. ఎక్కడో తెలుసా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Marriage : తల్లికి రెండో పెళ్లి చేసిన ఓ కొడుకు .. ఎక్కడో తెలుసా ?

 Authored By prabhas | The Telugu News | Updated on :25 January 2023,7:20 pm

Marriage : ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. యువరాజ్ శైలే అనే 23 ఏళ్ల కొడుకు తన తల్లికి రెండో పెళ్లి చేశాడు. తన పదేళ్ల వయసులో తన తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తండ్రి చనిపోయినప్పటి నుంచి తల్లి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ కాలం గడుపుతుంది. ఇక భర్త చనిపోయిన స్త్రీని సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిందే. ఇక షెలే తల్లి కూడా ఇరుగుపొరుగు వారితో మాట్లాడకుండా ఇంట్లోనే ఒంటరితనాన్ని అనుభవించింది. తల్లి పరిస్థితి చూసి బాధపడిన కొడుకు తల్లిని ఒంటరితనం నుంచి దూరం చేయాలని భావించాడు. అప్పుడే తన తల్లికి రెండో పెళ్లి చేయాలని ఆలోచించాడు కానీ రెండో పెళ్లి అంటే అంత ఈజీ కాదు. ఈ విషయాన్ని స్నేహితులు, బంధువులకు చెప్పి వరుడిని వెతకడం ప్రారంభించాడు.

ఈ క్రమంలోనే మారుతి అనే వ్యక్తి తన తల్లికి సరైన జోడిగా భావించాడు. అతడితో మాట్లాడి ఈ పెళ్ళికి ఒప్పించాడు. అయితే తల్లిని పెళ్ళికి ఒప్పించడం చాలా కష్టమైనది శైలే చెప్పాడు. ఈ క్రమంలో యువరాజు మాట్లాడుతూ నా తండ్రి నా చిన్నప్పుడే చనిపోయాడు. ఎన్నో కష్టాలను అనుభవించాను. నా తల్లి ఒంటరితనాన్ని అనుభవిస్తూ మానసికంగా ఎంతో క్షోభ చెందింది. ఆమెను ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. మా అమ్మ నాన్నకు 25 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఇక మనకు తెలిసిందే భార్య కోల్పోతే భర్తకు వెంటనే కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేస్తారు. అదే భర్తను కోల్పోయిన భార్యని మాత్రం ఒంటరిగా వదిలేస్తారు.

son do second marriage to mother

son do second marriage to mother

ఇవన్నీ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేవి. అందుకే నేను మా అమ్మకి మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే కొందరు స్నేహితులు బంధువులు నా నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. వారి సాయంతో నా తల్లికి వరుడిని వెతికాను. ఈ క్రమంలోనే మారుతి గణావత్ గురించి తెలిసింది. అతని గురించి మా అమ్మకు వివరంగా చెప్పి పెళ్లికి ఒప్పించాను. ఇక మారుతి మాట్లాడుతూ నేను కొన్నేళ్లుగా ఒంటరిగా ఉన్నాను, శైలేతో కలిసి మాట్లాడిన తర్వాత వారి కుటుంబంలోకి వెళ్లాలని భావించాను. రెండో పెళ్లి చాలా కఠిన నిర్ణయం అందుకు ఆమె ముందుగా ఒప్పుకోలేదని చెప్పారు. ఇక ఇరుగుపొరుగువారు శైలే చేసిన పనికి ప్రశంసలు కురిపించారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది