son of india movie trolls again in social media
Son Of India Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉన్న గౌరవం.. గుర్తింపు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్బుతమైన ఇండస్ట్రీ రికార్డును మోహన్ బాబు దక్కించుకున్నాడు. ఆయన ఒక గొప్ప నటుడు అనే విషయం అందరికి తెల్సిందే. ఆయన గొప్ప నటుడు అని అందరు అనడం బాగానే ఉంటుంది.. కాని ఆయనే తనకు తాను గొప్ప నటుడిని అంటూ పదే పదే డబ్బాలు కొట్టడం ఎబ్బెట్టుగా ఉంది. ఆయన పదే పదే అవే వ్యాఖ్యలు చేయడం.. ఆయన కుటుంబ సభ్యులు కూడా అదే డబ్బా కొట్టడం వల్ల మొత్తం ఇమేజ్ అంతా కూడా జనాల్లో డ్యామేజీ అయ్యింది.
ఇప్పుడు వారిని చిన్న చూపు చూస్తూ కొందరు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా విమర్శలు చేసేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు అన్నట్లుగా మంచు ఫ్యామిలీని విమర్శిస్తున్నారు. సందర్బం దొరికితే చాలు మంచు ఫ్యామిలీ పై ఎక్కేద్దాం అనుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి సమయంలో వచ్చిందే సన్నాఫ్ ఇండియా. సినిమా దారుణమైన పరాజయం పాలయ్యింది. అయ్యో పాపం అంటూ ప్రతి ఒక్కరు కూడా సినిమా విషయంలో ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల సమయంలో ఎదురైన అనుభవం నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మంచు ఫ్యామిలీ సైలెంట్ గా ఉంది.
son of india movie trolls again in social media
ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన సమయంలో మంచు ఫ్యామిలీ కనీసం ట్వీట్ కూడా చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. అయినా కూడా తగ్గేదే లే అన్నట్లుగా మంచు ఫ్యామిలీ యాంటీ ఫ్యాన్స్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. థియేటర్ రిలీజ్ చూడని వారు ఇప్పుడు ఓటీటీ లో చూసి మరీ విమర్శలు చేస్తున్నారు. సినిమా ఒక్కొక్క సన్నివేశంను వివరించుకుంటూ విమర్శలు చేస్తూ ఉంటే బాబోయ్ అంటూ మంచు ఫ్యాన్స్ అల్లాడి పోతున్నారు. సన్నాఫ్ ఇండియా విషయంలో సైలెంట్ గానే మంచు ఫ్యామిలీ ఉన్నా వారి యాంటీ ఫ్యాన్స్ మాత్రం మరీ వయెలెంట్ గా ప్రవర్తిస్తున్నారు.
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
This website uses cookies.