Home » Exclusive » Sonu Sood Meeting People Who Are In Need
Exclusive

Sonu Sood : సోనూ సూద్ నువ్వు నిజంగా దేవుడివి.. ఎందుకో ఈ వీడియో చూడండి..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: June 15, 2021 9:35 am
Advertisement

Sonu Sood : దేవుడు ఎవరు? ఎక్కడుంటాడు? ఎవ్వరికీ తెలియదు. నిజంగా దేవుడు మనం కోరుకున్న కోరికలు తీరుస్తాడా? అంటే చెప్పలేం. కానీ.. మనకు దేవుడి మీద నమ్మకం మాత్రం పోదు. ఆయన్ను నమ్ముకొనే బతుకుతుంటాం. అయితే.. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కదా. అందకే మనుషుల్లోనే కొందరికి మానవత్వం ఇస్తాడట. వాళ్లే దేవుడిలా మారి.. కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకుంటారట. ఈ కలియుగంలో, కరోనా కాలంలో మనకు దొరికిన దేవుడు సోనూసూద్. ఆయన వల్ల ఎంతో మంది లబ్ధి చెందారు. నేను కష్టాల్లో ఉన్నాను.. అంటే చాలు.. సోనూ సూద్ ముందుంటారు. వాళ్లకు సాయం చేస్తారు.

Advertisement

sonu sood meeting people who are in need

సోనూ సూద్ ఎంత మందికి సాయం చేశారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టారో మనం చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. చదువుతూనే ఉన్నాం. అందుకే సోనూ సూద్ కు తమ కష్టాలను చెప్పుకోవడం కోసం ఆయన ఇంటికి రోజూ వందల మంది వస్తున్నారు. రోజూ వందల కాల్స్ వస్తున్నాయి. అయినా కూడా తన టీమ్ రోజూ వెంట వెంటనే అందరి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Sonu Sood : ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసిన సోనూ సూద్

సోనూ సూద్.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. కొంతమంది తనను కలవడం కోసం ముంబైలోని తన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా సోనూసూద్.. వాళ్లతో మాట్లాడి.. వాళ్ల బాధలను తీర్చారు. కరోనా దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్నా.. కరోనా బారిన పడివాళ్ల సమస్యలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. కరోనా వల్ల.. ఎన్ని ఫ్యామిలీలు డిస్టర్బ్ అయ్యాయో.. చాలామంది ఇంకా కరోనా వల్ల ఇతర సమస్యలకు గురయి.. చికిత్స చేయించుకునే డబ్బులు లేక తెగ ఇబ్బందులు పడుతున్నారు.

ఇవాళ అభిషేక్ ను కలిశా. తనకు వినికిడి సమస్య వచ్చింది. ఇంకా ట్రీట్ మెంట్ నడుస్తోంది. నన్ను చూసి అభిషేక్ వెంటనే ఏడ్చేశాడు. కాళ్ల మీద పడ్డాడు. నాకు చాలా బాధేసింది. అభిషేక్ లవ్ ను చూసి ఆశ్చర్యపోయా. అభిషేక్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. అంటూ అభిషేక్ ను కలిసిన వీడియోను సోనూ సూద్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి==> Sonu Sood : వైఎస్సార్సీపీ సోనూసూద్ తో పెట్టుకుంటోందేంటి…?

ఇది కూడా చ‌ద‌వండి==> Brahmam Garu : ‘‘బ్రహ్మం గారి మఠం’’ గొడవను.. మరింత పెద్దది చేస్తున్నదెవరు?..

ఇది కూడా చ‌ద‌వండి==> NTR : జూనియర్ ఎన్టీఆర్ విషయంలో.. చంద్రబాబు భయం అదేనా?..

ఇది కూడా చ‌ద‌వండి==> Viral Video : పెళ్లి పీటల మీదే పెళ్లి కూతురు చేసిన పనికి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు?

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి