Sonu Sood : వైఎస్సార్సీపీ సోనూసూద్ తో పెట్టుకుంటోందేంటి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sonu Sood : వైఎస్సార్సీపీ సోనూసూద్ తో పెట్టుకుంటోందేంటి…?

 Authored By kondalrao | The Telugu News | Updated on :14 June 2021,10:32 am

Sonu Sood : శత్రువుకి శత్రువు మిత్రుడు. కానీ శత్రువుకి మిత్రుడు శత్రువు. సోనూ సూద్ పేరు ప్రస్తుతం దేశం మొత్తం మారుమోగుతోంది. అతని సామాజిక సేవా కార్యక్రమాలను ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారు. అంతవరకూ ఓకే. కానీ సోనూ సూద్ ఎప్పుడైతే తమ రాజకీయ శత్రువుని పొడిగారో అప్పుడే తమకీ శత్రువుగా మారాడన్నట్లుగా ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీ వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న వైద్య సేవలపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు మొన్న శనివారం ఒక జూమ్ మీటింగ్ పెట్టారు. అందులో సోనూ సూద్ తోపాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా హైదరాబాద్ ను చంద్రబాబు బాగా డెవలప్ చేశారని మెచ్చుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సోనూ సూద్ ని టార్గెట్ చేసింది.

గతంలోనూ ఒకసారి..

సోనూ సూద్ ఆ మధ్య చిత్తూరు జిల్లాలోని ఒక రైతుకు ట్రాక్టర్ పంపించటం పెద్ద వార్తయింది. కాడి కట్టడానికి ఎడ్లు లేక ఆడబిడ్డలతో అరక దున్నుతున్న ఆ రైతు పేదరికాన్ని చూసి సోనూ సూద్ కరిగిపోయాడు. వెంటనే ట్రాక్టర్ పంపాడు. అయితే అతను మరీ అంత పేదవాడేం కాదని, అసలు రైతే కాదని వైఎస్సార్సీపీ గవర్నమెంట్ తేల్చేసింది. తమ రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారనే బ్యాడ్ ఇమేజ్ రాకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆవిధంగా కవర్ చేసింది. అప్పుడే ఇరు వర్గాల మధ్య తొలిసారిగా విభేదాలు తలెత్తాయి. ఇప్పుడు చంద్రబాబును సోనూ సూద్ పొగడటం వల్ల మరోసారి తేడా కొట్టింది.

Differences between sonu sood and ysrcp

Differences between sonu sood and ysrcp

ఫలానా కులపోడు..: Sonu Sood

సోనూ సూద్ చంద్రబాబు గురించి చెప్పిన నాలుగు మంచి మాటలను టీడీపీ సోషల్ మీడియా వింగ్ హైలైట్ చేయటంతో వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమాల విభాగానికి మండింది. సోనూ సూద్ పై పొలిటికల్ ఎటాక్ మొదలుపెట్టింది. అతనిది ఫలానా కులం అంటూ పట్టిచూపింది. అయితే.. సోనూ సూద్ ని యావద్దేశం రియల్ హీరో అంటుంటే వైఎస్సార్సీపీ మాత్రం తిట్టడం ఏమీ బాగలేదనే టాక్ వినిపిస్తోంది. సోనూ సూద్ లాంటి వ్యక్తులకు కూడా కులాన్ని ఆపాదించటం పొలిటికల్ గా వైఎస్సార్సీకి మైనస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి విమర్శలు చేసేటప్పుడు కాస్త ముందూ వెనకా ఆలోచించుకోవాలని అనలిస్టులు సూచిస్తున్నారు. చావుకి, పెళ్లికి ఒకే డప్పు కొట్టడం సరికాదని సున్నితంగా హితవు పలుకుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> పార్టీ మారే ఆలోచ‌న ఉన్న పురంధేశ్వరి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Pk Plan : వైఎస్ జగన్ , పీకేల మధ్య చెడిందా..? ఈసారి తెలంగాణలో అడుగుపెడుతోన్న పీకే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jaganmohan Reddy : ఆ స‌ర్వేలో సీఎం జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న ఎలా ఉందంటే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ysrcp : మోడీ కేబినెట్‌లోకి వైసీపీ.. కేంద్ర మంత్రులుగా ఈ ఇద్ద‌రు…?

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది