NTR : జూనియర్ ఎన్టీఆర్ విషయంలో.. చంద్రబాబు భయం అదేనా?.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR : జూనియర్ ఎన్టీఆర్ విషయంలో.. చంద్రబాబు భయం అదేనా?..

 Authored By kondalrao | The Telugu News | Updated on :14 June 2021,4:59 pm

NTR : తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబ సభ్యులు ముందుండి నడిపించాల్సిందిపోయి నారా ఫ్యామిలీ మెంబర్స్ వారసులు కావటం విడ్డూరం. సీనియర్ ఎన్టీఆర్ కొడుకుల్లో హరికృష్ణ, బాలకృష్ణలకు తప్ప మిగతావారికి ఎవరికీ ప్రజాకర్షణ శక్తి లేదు. హరికృష్ణకు కొద్దో గొప్పో కరిజ్మా ఉన్నా, ఆయన చంద్రబాబుతో విభేదించి అన్న తెలుగుదేశం పేరుతో సొంత పార్టీ పెట్టినా నడిపించలేకపోయారు. మళ్లీ టీడీపీలోనే చేరి ఎంపీ అయ్యారు. అయినా పార్టీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకునేంత పట్టు సాధించలేకపోయారు. మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాద రూపంలో తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా దూరమయ్యారు. బాలకృష్ణ ఉన్నా బావ చంద్రబాబుతో వియ్యమందారు. ఎమ్మెల్యే పదవితో సరిపెట్టుకుంటున్నారు. మరో వైపు టీడీపీకి పాతికేళ్లకు పైగా ప్రెసిడెంటుగా ఉంటున్న చంద్రబాబుకు ఓల్డేజ్ వచ్చేసింది. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి గోల్డెన్ డేస్ ముగిసిపోతున్నాయి.

పుత్రోత్సాహం కరువు..

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పుత్రుడు ఉన్నాడు గానీ ఆ ఉత్సాహం ఆయనలో కనిపించట్లేదు. తనకు పొలిటికల్ వారసుడిగా లోకేష్ బాబు సమీప భవిష్యత్తులో సెట్ అయ్యేలా లేడు. దీనికితోడు చాలా మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీకి దూరం అవుతున్నారు. విపక్ష పార్టీలో ఉండటం వల్ల రానున్న రోజుల్లో విషమ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందనేదే వాళ్ల ఆందోళన. ఈ నేపథ్యంలో కొంత మంది కేడర్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మారాలని కోరుకుంటున్నారు. మళ్లీ నందమూరి వంశాంకురం వస్తే తప్ప టీడీపీకి మంచి రోజులు రావని అనుకుంటున్నారు. అందుకే ధైర్యం చేసి అధిష్టానానికి అదే విషయాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలియజేస్తున్నారు.

tdp cadre demanding ntr reentry to tdp

tdp cadre demanding ntr reentry to tdp

హిస్టరీ.. రిపీట్స్..: NTR

చరిత్ర పునరావృతం అవుతుందంటారు. అది తెలుగుదేశం పార్టీకీ వర్తిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేతికి చిక్కటం ఖాయమని పేర్కొంటున్నారు. టీడీపీ వర్గాలు సైతం ఇదే కోరుకుంటున్నాయి. ఆ ఆకాంక్షలు కూడా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే ఒకటికి రెండు సార్లు బయటపడుతుండటం చెప్పుకోదగ్గ విషయం. ఇదే చంద్రబాబుకు మింగుడు పడని విషయం. తన కుమారుడు లోకేష్ బాబును భావి తెలుగుదేశాధినేతగా తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తుంటే బాహుబలి సినిమాలో మాదిరిగా జనమేంటి జూనియర్ ఎన్టీఆర్ పేరును కలవరిస్తున్నారని ఆయన మథనపడుతున్నారు. టీడీపీలోకి నందమూరి కుటుంబ సభ్యులు ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే ఇక నారా ఫ్యామిలీ చాప చుట్టేయాల్సి వస్తుందని బాబు బెంగపడుతున్నారు. అయినా తాత ఆస్తిని అనుభవించాల్సింది, పెంచి పెద్ద చేయాల్సింది అసలైన మనవడే (కొడుకు కొడుకే) గానీ ఆ మనవడు (బిడ్డ కొడుకు లోకేష్) కాదనేది జగమెరికిన సత్యం. అందులో చంద్రబాబు ఫీలవ్వటానికేముంది?.

ఇది కూడా చ‌ద‌వండి==> Ys Jagan : సీఎం జ‌గ‌న్‌పై వాళ్లంతా సీరియ‌స్‌గా ఉన్నారంటా..?

ఇది కూడా చ‌ద‌వండి==> Sonu Sood : వైఎస్సార్సీపీ సోనూసూద్ తో పెట్టుకుంటోందేంటి…?

ఇది కూడా చ‌ద‌వండి==> పార్టీ మారే ఆలోచ‌న ఉన్న పురంధేశ్వరి..!

ఇది కూడా చ‌ద‌వండి==> Ysrcp : మోడీ కేబినెట్‌లోకి వైసీపీ.. కేంద్ర మంత్రులుగా ఈ ఇద్ద‌రు…?

Advertisement
WhatsApp Group Join Now

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది