Sri Reddy : మొద‌టి సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని స‌పోర్ట్ చేస్తూ వైసీపీ నాయ‌కుడి తొక్క తీస్తానంటూ ఫైర్ అయిన శ్రీరెడ్డి

Authored By Sam C | The Telugu News | Published on: October 28, 2022, 11:00 am

Sri Reddy : కాస్టింగ్ కౌచ్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది శ్రీరెడ్డి. ఒక‌ప్పుడు న‌టిగా ఇండ‌స్ట్రీలో ప‌లు ప్ర‌య‌త్నాలు చేసిన శ్రీరెడ్డి ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియా ద్వారామ మ‌రింత పాపులారిటీ ద‌క్కించుకుంది. రానా త‌మ్ముడు ద‌గ్గుబాటి అభిరామ్ త‌న‌ని వాడుకొని వ‌దిలేసాడు అంటూ శ్రీరెడ్డి ప‌లు సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఈ అమ్మ‌డు పవన్ కళ్యాణ్ అమ్మని తిట్టి పెద్ద వివాదానికి కేంద్ర బిందువయింది. త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పింది. అయితే తనని ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల్ని తిప్పికొడుతూ చెప్పుతో వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

దీంతో శ్రీరెడ్డి రంగంలోకి దిగి, పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరుగుతూ పచ్చి బూతులతో తిడుతూ వీడియో వదిలింది. లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్‌కి చెప్పు చూపించింది. ‘ఇది బాటా వాళ్ల చెప్పు.. చాలా స్ట్రాంగ్.. కొట్టానంటే మామూలుగా ఉండదు.. పవన్ కళ్యాణ్ ఎర్రి తనానికి.. రౌడీయిజానికి.. టైం దగ్గరపడింది. నన్ను ఎన్ని తిడతారో తిట్టండి.. నాకేం సిగ్గులేదు.. సిగ్గులేని దానికి తెడ్డే లింగం.. బయపడేది లేదు. ఇది ప్రజాస్వామ్యమా? ఇంకేమైనానా? మంత్రుల్ని కొట్టి.. చెప్పులు చూపించి రౌడీయిజం చూపిస్తారు. మీకు అసలు రౌడీయిజం ఎలా ఉంటుందో చూపించాల్సిందే. రాడ్‌లతో వస్తారా? రాళ్లతో వస్తారా? అంటావా? ఆ బొల్లు గాడు అంటూ నానా మాట‌లు అంది.

Sri Reddy supports to pawan kalyan

Sri Reddy supports to pawan kalyan

Sri Reddy : శ్రీరెడ్డి ఫైర్..

అయితే మొన్న‌టికి మొన్న అంత దారుణ‌మైన వ్యాఖ్లు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా నిలిచింది. రీసెంట్ గా వైసీపీ నాయ‌కుడు బోరుగ‌డ్డ అనిల్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటూ ఆయ‌న ఫ్యామిలీని, పిల్ల‌ల‌ను సైతం దుర్భాష‌లాడాడు. దీంతో శ్రీరెడ్డి ఫైర్ అవుతూ.. నువ్వు ఏ పార్టీలో ఉన్నా స‌రే ఆడాళ్లు, పిల్ల‌ల జోలికొస్తే తొక్క తీస్తా కొడ‌కా అంటూ ఫైర్ అయ్యింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య‌ను పిల్ల‌ల‌ను వైసీపీలోని అనిల్ అనే ద‌రిద్రుడు ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిడుతున్నాడు. వీడు వైసీపీ పార్టీ పేరు చెప్పుకుని బెదిరింపుల‌కు పాల్ప‌ప‌డుతున్నాడు. మూడు పెళ్లిళ్లు చేసుకుంది ప‌వ‌న్ ద‌మ్ముంటే ఆయ‌న్ను తిట్టు. పెళ్లాం పిల్ల‌ల జోలికి వ‌స్తే న‌రుకుతా…జ‌గ‌న్ అన్న ఇలాంటివి ఎంక‌రేజ్ చేయ‌డు అంటూ శ్రీరెడ్డి వీడియోలో చెప్పుకొచ్చింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp