BJP : బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలేదు
BJP : ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆంధ్రప్రదేశ్ కు ఏం చేస్తుందో చెప్పాలంటూ రాష్ట్ర నాయకులను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించాడు. బిజెపి నాయకులు రాష్ట్రంలో చేస్తున్నహడావుడి పై ఆయన విమర్శలు చేశాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తో ఏపీ ప్రజలు బీజేపీని నమ్మే అవకాశం అస్సలు లేదని ఆయన ఎద్దేవా చేశాడు. ఎనిమిది సంవత్సరాల్లో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏంటి.. వారు తీసుకు వచ్చిన నిధులు ఎన్ని అనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతుంది, అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి విషయంలో వైకాపా అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరి ఎవరు కూడా బీట్ చేయలేరు అంటూ ఆయన తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుల కోసం ఇప్పటి నుండే ఆ పార్టీల ప్రాకులాడుతున్నాయి. కనుక ఆ పార్టీల నుండి కచ్చితంగా ప్రజలను వైకాపా కాపాడుకుంటుంది అంటూ శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో అన్ని రకాలుగా వైకాపా మెజార్టీ సాధిస్తుందనే నమ్మకాన్ని ఇప్పటికే వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు జనాల్లోకి తీసుకు వెళ్లేలా ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ బిజెపిపై విమర్శలు చేయడం జరిగింది.రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాకుండా చేయడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం గా భావించే
ప్రత్యేక హోదా ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. బిజెపి నాయకులు చేత కాకుండా చూస్తూ ఉండడం వల్లే రాష్ట్రం పై బిజెపి పెత్తనం చేసే ప్రయత్నం చేస్తుందని.. అలాగే రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది అంటూ ఆయన ఆరోపించాడు. మరోవైపు బీజేపీ మాత్రం భారీగా ఏపీలో సభలు నిర్వహించడం ద్వారా జనాల్లోకి ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలను వైకాపా కార్యకర్తలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.