Thatikonda Rajaiah : ఎమ్మెల్యే రాజయ్య కాల్ చేసి ఒంటరిగా రమ్మంటున్నాడు.. మహిళా సర్పంచ్ ఆరోపణలు
Thatikonda Rajaiah : స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మరో ఆరోపణ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రాజయ్యపై ఇప్పటికే పలు సార్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన 2014 లో తొలి సారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి సీఎం కేసీఆర్ తొలగించారు. కానీ.. ఆయన ఇంకా తన అవినీతి, అక్రమాలను మానడం లేదని తెలుస్తోంది. తాజాగా ఓ మహిళా సర్పంచ్ ఆయనపై ఆరోపణలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామ సర్పంచ్ అయిన కుర్సపల్లి నవ్య ప్రవీణ్.. ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలు చేశారు.
నన్ను లైంగికంగా వేధిస్తున్నారు. రాజకీయ నాయకులు వేధిస్తున్నారు. ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. వాళ్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లాలి. ఏం చేయమంటే అది చేయాలి. అలా చేస్తేనే గ్రామ అభివృద్ధికి సహకరిస్తారు. నిధులు ఇస్తారు. లేదంటే ఇవ్వరు. వాళ్లు ఎట్లా చెబితే అట్లా వినాలి. వాళ్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లాలి. వాళ్లు ఏవిధంగా ఉండమంటే ఆ విధంగా ఉండాలి అంటూ ఆమె బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేశారు. ఒంటరిగా రావాలంటారు. భర్తతో రావద్దంటారు. నా భర్తను కించపరిస్తే నాకు బాధ అనిపించదా? మీకు భార్యలు లేరా? మేము భర్తలు లేకుండానే రాజకీయం చేస్తున్నామా? నీకేం అన్యాయం జరుగుతోందని అంటున్నారు. ఎమ్మెల్యే కాల్ చేసి రమ్మంటున్నారు.
Thatikonda Rajaiah : భర్త రావద్దు.. భర్త రాజకీయం చేయద్దు అంటారు
నువ్వు ఖచ్చితంగా కాల్ చేస్తే రావాలి. ఇంట్లో కూర్చొంటే కాదు. నీకు టికెట్ ఇచ్చింది ఇంట్లో కూర్చోవడానికి కాదు. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి అంటూ ఎమ్మెల్యే నాకు కాల్ చేసి టార్చర్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నన్ను రమ్మని మీటింగ్ లలో అక్కడా ఇక్కడా నా మీద చేతులు వేయడం, టచ్ చేయడం చేస్తున్నారు. నేను ఆయన్ను తండ్రిలా చూసుకున్నా. కానీ.. నన్ను ఆ విధంగా చూస్తున్నాడు. రాజకీయం అంటే నీతిగా చేయాలి. సోషల్ డిస్టాన్స్ మెయిన్ టెన్ చేయాలి. నేను చెప్పినట్టు వింటేనే అంటే ఎలా? వాళ్లు మాట్లాడిన ఆధారాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అన్నీ నేను సమయం వచ్చినప్పుడు బయటపెడతా అని నవ్య మీడియాకు చెప్పారు.