Different Village : ఈ ఊరిలో వింత ఆచారాలు తెలిస్తే మీకు షాక్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Different Village : ఈ ఊరిలో వింత ఆచారాలు తెలిస్తే మీకు షాక్..!

 Authored By mallesh | The Telugu News | Updated on :11 October 2021,6:00 am

Different Village : ప్రజెంట్ టెక్నాలజీ వినియోగం గతంతో పోల్చితే బాగా పెరిగిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతీ సంఘటనను గురించి తెలుసుకుంటు అప్‌డేట్ అవుతున్నారు. అయితే, అంత మాత్రం చేత సొసైటీలో గణనీయమైన మార్పులు వచ్చాయనుకుంటే మీరు పొరపడినట్లే.. ఇంకా నేటి సమాజంలో కొన్ని గ్రామాల్లో వింత ఆచారాలను ప్రజలు పాటిస్తున్నారు. అటువంటి గ్రామాల్లో ఒకదాని గురించి తెలుసుకుందాం.

Strange Customs Of A Village

Strange Customs Of A Village

సాధారణంగా సమాధులు ఏ ఊరిలోనైనా ఊరి బయటనే కనబడుతూ ఉంటాయి. ప్రభుత్వాలు సైతం శ్మశాన వాటికలను విలేజ్‌కు దూరంగా నిర్మించాలని సూచిస్తున్నాయి. అయితే, ఆ ఊరిలో మాత్రం శ్మశాన వాటిక ఊరి మధ్యలోనే ఉంటుంది. ఇంటి ముందర సమాధి ఉండటం మీరు ఎక్కడా చూసి ఉండబోరు. కానీ ఆ గ్రామంలో మాత్రం ఇంటి ముందరే సమాధులు ఉండటం గమనార్హం. అదేంటి ఇంటి ముందు స‌మాధులు ఉంటే ఎలా అనుకుంటున్నారా కానీ ఆ గ్రామస్తులు మాత్రం సమాధుల‌నే త‌మ‌కు శ్రీరామ ర‌క్ష‌గా భావిస్తుంటారు.

Strange Customs Of A Village

Strange Customs Of A Village

Different Village : ఈ విలేజ్‌లో మంచం అస్సలు కనబడదు..

ఆ గ్రామం పేరే అయ్యకొండ. దాదాపు గ‌త ఏడు తరాలుగా ఈ గ్రామ‌స్తులు ఇలాంటి వింత ఆచారాన్ని కొన‌సాగిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలానికి చెందిన‌టువంటిదే ఈ గ్రామం. దాదాపుగా 254 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1, 426 మంది ఉన్నారు. ఈ ఊరిలో ఇప్ప‌టి దాకా అస్స‌లు మంచాలు వాడ‌కుండానే నివ‌సిస్తున్నారు. గ‌తంలో మునిస్వామి తాత అనే వ్య‌క్తి ఈ ఊరికి పెద్ద దిక్కుగా ఉండేవాడు. అయితే ఆయ‌న మంచం వాడ‌క‌పోవ‌డంతో అప్ప‌టి నుంచే ఈ ఆచారం ప్ర‌చుర‌ణ‌లోకి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. అంతే ఈ ఊరిలో ఎవ‌రి ఇంట్లో ఎలాంటి పండుగ‌లు జ‌రిగినా లేదంటే వంట‌లు చేసుకున్నా ముందుగా మునిస్వామి తాత‌కు స‌మ‌ర్పించుకుంటారు. అందుకే ఈ గ్రామం అంతా ఒక్క తాటిమీద న‌డుస్తోంది.

Strange Customs Of A Village

Strange Customs Of A Village

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది