Sudheer : రష్మీ ముందు అడ్డంగా బుక్కయిపోయిన సుధీర్.. రష్మీని వదిలేసి జడ్జి పూర్ణతో రొమాన్స్?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 24 June 2021, 9:07 am

Sudheer : సుడిగాలి సుధీర్ ఎక్కడుంటే అక్కడ రచ్చనే. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులే. సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు బుల్లితెర మీద ఆయన ఇప్పుడు పెద్ద సెన్సేషన్. సుడిగాలి సుధీర్ తెలుగు బుల్లితెరను ఏలేస్తున్నాడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. మొత్తం మీద టాప్ కమెడియన్ గా స్థానం సంపాదించాడు సుధీర్. ఇక.. సుధీర్ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే కదా. రష్మీ, సుధీర్.. ఇద్దరూ గత 8 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారని అంతా అంటున్నారు. అయితే.. వాళ్లిద్దరి మధ్య ఏం ఉన్నది? లేదు? అనేది ఎవ్వరికీ తెలియదు కానీ.. షోలలో కానీ.. జబర్దస్త్ లో కానీ.. వాళ్ల మధ్య రాపో మాత్రం బాగానే ఉంటుంది.

sudigali sudheer and rashmi in dhee 13 show

sudigali sudheer and rashmi in dhee 13 show

వాళ్ల ప్రేమ వ్యవహారం విషయం పక్కన పెడితే.. ఆ జంటకు ఆన్ స్క్రీన్ మీద ఉన్న క్రేజే వేరు. ఇద్దరూ కలిస్తే రచ్చ రంబోలానే. వాళ్లిద్దరూ కలిసి చాలాసార్లు ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ చేశారు. అది బాగా పండింది కూడా. ఢీ షోలో కూడా ఇద్దరూ చేసే రచ్చ మామూలుగా ఉండదు.

Sudheer : జడ్జి పూర్ణతో సుడిగాలి సుధీర్ ప్రేమ వ్యవహారం

సుడిగాలి సుధీర్ అంటే ఖచ్చితంగా రష్మీ అనే పేరు రావాల్సిందే. కానీ.. సుడిగాలి సుధీర్ మాత్రం రష్మీని వదిలేసి.. జడ్జి పూర్ణతో రొమాన్స్ చేశాడు. ఢీ షోలో సుడిగాలి సుధీర్ జడ్జి పూర్ణతో.. హైపర్ ఆది.. జడ్జి ప్రియమణితో రొమాన్స్ చేస్తుండగా.. రష్మీ, దీపిక.. ఇద్దరూ వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

sudigali sudheer and rashmi in dhee 13 show

sudigali sudheer and rashmi in dhee 13 show

ఏంటి సుధీర్.. మన 8 ఏళ్ల బంధానికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా? నీకిది తగునా? ఇవ్వాలో రేపో నీ లవ్ ప్రపోజల్ ను ఒప్పుకుందామనుకున్నా. కానీ.. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు.. అంటూ రష్మీ సుడిగాలి సుధీర్ ను ఏకి పారేసింది. దీపిక కూడా అంతే.. హైపర్ ఆదిపైకి ఎక్కేసింది. ఇలా.. రష్మీ ముందు సుడిగాలి సుధీర్ అడ్డంగా దొరికిపోయాడు.

sudigali sudheer and rashmi in dhee 13 show

sudigali sudheer and rashmi in dhee 13 show

ఆగండాగండి.. ఇదంతా నిజం అనుకునేరు. ఇది నిజం కాదు. అంతా ఉత్తుత్తి. ఢీ షోలో వీళ్లంతా కలిసి ఓ స్కిట్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమోనే తాజాగా విడుదల చేశారు. అంతే.. అంతకుమించి ఇంకేం కాదు. ఏది ఏమైనా.. అది స్కిట్ అయినా కూడా.. రష్మీ మాత్రం తన మనసులో మాటను నిజంగానే బయటపెట్టినట్టు కనిపిస్తోంది. జడ్జి పూర్ణతో రొమాన్స్ చేస్తుంటే తను చూస్తూ తట్టుకోలేకపోయింది. అంటే.. సుధీర్ మీద తనకు కాస్తో కూస్తో ప్రేమ ఉందన్నమాట. సరె సర్లే.. ముందైతే ఢీ షో లేటెస్ట్ ప్రోమోను చూసేయండి.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "Rainy Season Vegetables : వర్షాకాలంలో ఈ 4 కూరగాయలు తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందే..!"

  2. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  3. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  4. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  5. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  6. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  7. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి