Suma: స్టేజ్ మీద సెహ‌రి చిత్ర బృందంతో తీన్‌మార్ స్టెప్పులేసిన సుమ‌.. ఆ ర‌చ్చ ఏందిరా బాబు..!

Authored By Sam C | The Telugu News | Updated on: February 9, 2022, 12:33 pm

Suma: యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి ప్రధాన పాత్రలో డైరెక్టర్ జ్ఞానశేఖర్ ద్వారక తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం సెహరి . ఇందులో హర్ష్ సరనస సిమ్రాన్ చౌదరి హీరోయిన్‏గా నటిస్తుంది. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా రూపొందిన చిత్రం ‘సెహరి’. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. రీసెంట్‌గా మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌గా, ఆ కార్య‌క్ర‌మానికి సుమ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. అంతేకాదు చిత్ర బృందంతో క‌లిసి తీన్మార్ట్ స్టెప్పులు వేసింది. సుమ డ్యాన్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక‌య్యారు. అంద‌రి ముందు సుమ తీన్మార్ స్టెప్పులకు డ్యాన్స్ చేయ‌డాన్ని క‌ళ్ల‌ప్ప‌గించి చూశారు.

సుమనా, మ‌జాకానా..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు సుమ‌. పుట్టి పెరిగింది కేర‌ళ‌లో అయినా టాలీవుడ్ బుల్లితెర‌పై ఓ వెలుగు వెలుగుతున్నారు. యాంకరింగ్‌లో త‌న‌కు ఎవ‌రూ సాటి లేర‌న్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఏ కార్య‌క్ర‌మం, ఆడియో ఫంక్ష‌న్‌, ఈవెంట్ అయిన యాంక‌ర్‌గా సుమ ఉండాల్సిందే. త‌న మాట‌ల‌తో చిన్న నుంచి పెద్ద‌ల వ‌రకు అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నారు. సుమ వేసే పంచులు, మాట‌ల‌తో షో ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని అంద‌రి అభిప్రాయం. ఇన్నాళ్లు బుల్లితెర‌పై సంద‌డి చేసిన సుమ ఇప్పుడు వెండితెర‌పై కూడా ర‌చ్చ చేయ‌నుంది.

Suma Stunning Dance with Sehari Team

Suma Stunning Dance with Sehari Team

సుమ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాను సుమ దగ్గరుండి ప్రమోట్ చేస్తోంది. రామ్ చరణ్, రానా వంటి వారిని ఇప్పటికే సుమ రంగంలోకి దించేసింది. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను రామ్ చరణ్ చేత రిలీజ్ చేయించింది. ఆ తరువాత రానాతో మరొక ప్రమోషన్ ఈవెంట్ చేయించింది. దర్శక ధీరుడు రాజమౌళితో ఓ పాటను రిలీజ్ చేయించింది.ఇందులో సుమ ఊరు పెద్ద‌గా అల‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp