Sunflower Seeds | పొద్దు తిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి అద్భుతమైన వరం .. కొలెస్ట్రాల్‌ని తరిమికొట్టేస్తుంది..!
Sunflower Seeds | అన్ని రకాల విత్తనాల్లో పోషకాల నిధి దాగి ఉన్నప్పటికీ, పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి అద్భుతమైన వరంగా వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా పొద్దుతిరుగుడు నూనె వాడకం ఎక్కువగా ఉన్నా, విత్తనాలు తినడం ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం 30 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాల్లోనే 5.5 గ్రాముల ప్రోటీన్, 14 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్, మాంగనీస్, రాగి, మెగ్నీషియం, ఇనుము, విటమిన్లు వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి.

#image_title
వీటితో ఎన్నో ఉపయోగాలు..
ఇతర విత్తనాలతో పోలిస్తే వీటిలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉన్న విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను బలపరుస్తాయి. గుండెలో మంటను నివారిస్తాయి.
అయోడిన్, సెలీనియం పుష్కలంగా ఉండటం వల్ల థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. వాపును తగ్గించి ఎముకలను బలపరుస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడం ద్వారా షుగర్ ప్రమాదాన్ని నియంత్రిస్తాయి. మెగ్నీషియం, పాంటోథెనిక్ ఆమ్లం కండరాల నొప్పులను తగ్గించి, శక్తిని పెంచుతాయి. వైద్యులు చెబుతున్నట్లుగా, పొద్దుతిరుగుడు విత్తనాలను చిరుతిండిగా తినడం లేదా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మహిళలు, పురుషులు ఇద్దరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.