Bad Cholesterol : మీ ముఖం పై ఇలాంటి గుర్తులు ఉన్నాయా… కచ్చితంగా చెడు కొలెస్ట్రాల్ కు సంకేతలే…!
Bad Cholesterol : ప్రస్తుత కాలంలో చాలామందికి చెడు కొలెస్ట్రాల్ పెరగటం ఒక సమస్యగా మారింది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వలన ఎంతో ప్రమాదం అని వైద్యులు పదేపదే చెబుతూఉంటారు. మీరు గనక కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే. లిపిడ్ పరీక్ష ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ శరీరంలో LDL అనగా చెడు కొలెస్ట్రాల్ పెరగటం ప్రారంభం అవుతుంది అని సూచించే కొన్ని లక్షణాలు సరైన టైంలో అర్థం చేసుకున్నట్లయితే మీ జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వలన వాటిని నియంత్రించవచ్చు. మీ ముఖంపై ఇలాంటి గుర్తులు కనుక మీకు కనిపిస్తే కచ్చితంగా కొలెస్ట్రాల్ ను చెక్ చేసుకోవాలి. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Bad Cholesterol చర్మం పసుపు
మీ ముఖము పసుపు రంగులో మారితే అది రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగకపోవడం వలన వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది రక్తప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో చర్మం అనేది పసుపు రంగులోకి మారుతుంది..
2. ముఖంపై గడ్డలు కనిపిస్తున్నాయా : కొంతమందికి కొన్నిసార్లు మొఖంపై గడ్డలు కనిపిస్తాయి. ఇలాంటి చిన్నపాటి గడ్డలను పట్టించుకోరు. కానీ ఈ గడ్డలు అనేవి సాధారణంగా కళ్ళ చుట్టూ ఏర్పడే అధిక చెడు కొలెస్ట్రాల్ అని అర్థం..
3. కళ్ళు చుట్టు పసుపు మచ్చలు : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగేటప్పుడు కళ్ళ చుట్టూ లేత పసుపు రంగు దద్దుర్లు మరియు కొన్ని చిన్నపాటి పసుపు రంగు మొటిమలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనుక మీకు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్ కు సంకేతాలు అని తెలుసుకోండి..
4. ముఖం మీద వాపు : ముఖం మీద వాపు రావడానికి ఎన్నో కారణాలు కూడా ఉండవచ్చు. కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వలన కూడా ముఖం పై వాపు వస్తుంది. దీంతో ముఖం అనేది ఉబ్బుగా కనిపిస్తుంది. అలాగే చర్మం కూడా పూర్తిగా పొడిబారటం మొదలవుతుంది…