Health Benefits : పొద్దు తిరుగుడు గింజలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…
Health Benefits : పొద్దు తిరుగుడు పువ్వు అంటే తెలియని వారు ఉండరు. అయితే ఈ పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాల లో ఉన్న లాభాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ పొద్దు తిరుగుడు గింజలు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పొద్దు తిరుగుడు గింజలలో విటమిన్ ఈ, మెగ్నీషియం, హెల్ది ఫ్యాట్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. ఈ గింజలను ప్రతి రోజు ఒక స్పూన్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ గింజలను తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… పొద్దు తిరుగుడు గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వు అనేది అధిక మోతాదులో ఉంటుంది.
ఇది చెడు కొవ్వును కరిగించటంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ ఈ ఒక పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షిస్తుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ పొద్దు తిరుగుడు గింజలు అనేవి రోగనిరోధక శక్తిని పెంచడంలో మేలు చేస్తాయి. దీనిలో ఉన్న సెలీనియం అనేది రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది. దీని వలన ఇన్ఫెక్షన్ అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఈ పొద్దు తిరుగుడు గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మా ఆరోగ్యాన్ని ఎంతగానో మేలు చేస్తాయి. ఈ పొద్దు తిరుగుడు విత్తనాలనేవి లోపలి నుండి మాయిశ్చరైజింగ్ ను ఇస్తాయి… ఈ పొద్దు తిరుగుడు గింజలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన జీర్ణం తొందరగా అవుతుంది. అలాగే బలబద్ధక సమస్య నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.
అంతేకాక డయాబెటిస్ ని కూడా అదుపులో ఉంచుతుంది. అయితే ఈ పొద్దు తిరుగుడు విత్తనాలను రోజు తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర స్థాయి కంట్రోల్ లో ఉంటుంది. అలాగే దీనిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండటం వలన మధుమేహ సమస్య కూడా రాదు. ఈ పొద్దు తిరుగుడు గింజలలో మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలను ఎంతో బలంగా చేస్తుంది. ఈ విత్తనాలను తీసుకుంటే ఎముకల బలహీనత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ గింజలలో ఉండే విటమిన్ b6, మానసిక స్థితి మరియు ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. అలాగే ఈ గింజలలో విటమిన్ ఈ బి1 బి6, రాగి,ఇనుము, జింక్, మాంగనీస్, పొటాషియం లాంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ పొద్దు తిరుగుడు గింజలలో ఉండే బీటా సేటోస్టెరాస్ మరియు ఎంతో బలమైన యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు అనేవి రొమ్ము క్యాన్సర్ తో సహా ఇతర క్యాన్సర్లను కూడా నియంత్రించగలదు…