Sweet Corn Snack Recipe : నోటికి ఏది తిన బుద్ధి కానప్పుడు ఈ స్వీట్ కార్న్ తో ఇలా స్నాక్ ట్రై చేయండి… రుచి అద్భుతంగా ఉంటుంది.
Sweet Corn Snack Recipe : స్వీట్ కార్న్ ని ఎక్కువగా ఉడికించి లేదా నిప్పుల పైన కాల్చి తీసుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు అలా తినడం బోర్ కొడుతూ ఉంటుంది ఆ సమయంలో ఈ స్వీట్ కార్న్ ని ఇలా స్నాక్ గా తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఈ స్నాక్ చేసుకోవడం చాలా సులువు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ కం స్నాక్ ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో నేను చూసేద్దాము…వీటికి కావలసిన పదార్థాలు : స్వీట్ కార్న్, క్యాప్సికం ఉల్లిపాయలు క్యారెట్ తురుము, కారం, ఉప్పు, అల్లం, ఎల్లిపాయ, పసుపు చాట్ మసాలా జీలకర్ర ధనియాల పౌడర్, సెనగపిండి, బియ్యం పిండి, కొత్తిమీర, మొదలైనవి…
దీని తయారీ విధానం : ఒక బౌల్లో ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు క్యారెట్ తురుము, స్వీట్ కార్న్ ని గింజలను తురిమి దాన్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం తురుము, కొంచెం ఎల్లిపాయ తురుము, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్ ,కొంచెం కొత్తిమీర, నాలుగు స్పూన్ల శెనగపిండి నాలుగు స్పూన్ల బియ్యప్పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడల్లా చేసుకుని చిల్లులు గిన్నె పైన పెట్టి..
స్టవ్ పై గిన్నెలో నీళ్లను పోసి కాగుతున్న నీటి పైన పెట్టి కొద్దిసేపు ఈ వడలను ఆవిరిపై ఉడికించాలి. తర్వాత ఆ ఆవిరి పైన ఉడికిన వడలను మళ్లీ స్టవ్ పై కడాయి పెట్టి దానిలో ఆయిల్ ఆ ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా నెమ్మదిగా నాలుగు నాలుగు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. ఇలా ఫస్ట్ ఆవిరిపై ఉడకనించడం వలన ఆ వడలు విడిపోకుండా సాఫ్ట్ గా కరకరలాడుతూ వస్తాయి.అంతే ఎంతో సింపుల్ గా స్వీట్ కార్న్ స్నాక్ రెడీ. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇది చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.