Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం 2 జనవరి 30 ఎపిసోడ్: జ్యోత్స్నకు షాకిచ్చిన పారిజాతం.. జ్యోత్స్న పాపం పండిందా? పారిజాతం తీసుకున్న నిర్ణయం ఏంటి? శ్రీధర్ ఎమోషనల్..!
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల పెళ్లికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న జ్యోత్స్న, పారిజాతం ఎత్తుగడలు ఇప్పుడు వారికే బూమరాంగ్ అవుతున్నాయి. ఈరోజు (జనవరి 30) ఎపిసోడ్ లో జరిగిన హైడ్రామా ఏంటో తెలుసుకుందాం రండి.
#image_title
Karthika Deepam 2 Today Episode : జ్యోత్స్నపై పారిజాతం అనుమానం?
నిన్నటి వరకు మనవరాలికి వంత పాడిన పారిజాతం, ఇప్పుడు జ్యోత్స్నను అనుమానించే పరిస్థితి వచ్చింది. కార్తీక్ వేసిన ప్లాన్ అద్భుతంగా పనిచేసిందనే చెప్పాలి. దాసు మాయం వెనుక ఎవరున్నారనే విషయంపై కార్తీక్, పారిజాతాన్ని నిలదీయడమే కాకుండా, ఆమె మనసులో అనుమానపు బీజాలు నాటాడు. “నీ కొడుకు కనబడకుండా పోవడానికి, నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో ఆ మనిషికి సంబంధం ఉందని నీకు అర్థమైందా పారు?” అని కార్తీక్ అడిగిన ప్రశ్నకు పారిజాతం షాక్ అవుతుంది.
కేవలం ప్రశ్నతో ఆపకుండా, “నీ మనవరాలి మీద ఓ కన్నేసి ఉంచు. తను ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో, ఎవరితో మాట్లాడుతుందో కనిపెట్టు.. అప్పుడే అసలు నిజం తెలుస్తుంది” అని కార్తీక్ హెచ్చరించాడు. దీంతో ఇన్నాళ్లు జ్యోత్స్నను వెనకేసుకొచ్చిన పారిజాతం, ఇప్పుడు ఆమె పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టింది. జ్యోత్స్న ప్రవర్తనను పారిజాతం గమనిస్తుందనే విషయం జ్యోత్స్నకు తెలియకపోవడం ఇక్కడ కొసమెరుపు. ఇది రాబోయే ఎపిసోడ్లలో పెద్ద ట్విస్ట్ కు దారితీయవచ్చు.
Karthika Deepam 2 Today Episode : శ్రీధర్ ఎమోషనల్ డ్రామా.. కాంచన మనసు కరిగేనా?
మరోవైపు, శ్రీధర్ తన మొదటి భార్య కాంచన దగ్గరకు వెళ్లి క్షమించమని ప్రాధేయపడటం ఈ ఎపిసోడ్ హైలైట్. కాశీ, స్వప్నల విషయంలో జరిగిన గొడవను ప్రస్తావిస్తూ శ్రీధర్ తన బాధను వెళ్లగక్కాడు. “కాశీ తప్పు తెలుసుకున్నప్పుడు స్వప్న క్షమించినట్లు, నేను కూడా మారిపోయాను కదా.. నన్ను ఎందుకు క్షమించవు?” అని శ్రీధర్, కాంచనను ప్రశ్నిస్తాడు.
అక్కడే ఉన్న కార్తీక్, దీపలను కూడా తన వైపు మాట్లాడమని శ్రీధర్ కోరడం ఆసక్తికరం. “కాశీకి ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? ప్రాణం పోయినా బతికి ఉండే బంధం మాది” అంటూ శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కార్తీక్ కూడా ఆలోచనలో పడతాడు. “అందరి కాపురాలు బాగుండాలని కోరుకుంటావు కదా కాంచన, మరి నీ కాపురంలో సమస్య వస్తే ఇలా కఠినంగా ఉంటావా?” అని శ్రీధర్ నిలదీస్తాడు.
Karthika Deepam 2 Today Episode : కార్తీక్ మద్దతు ఎవరికీ?
తండ్రి ఆవేదన చూసిన కార్తీక్, తల్లి కాంచనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. “అమ్మ కాకముందే నీకు భార్య అనే స్థానం ఉంది. కానీ ఒక ఆడదానిగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ నీకు ఉంది. మీ నిర్ణయాలకే వదిలేస్తున్నా.. కానీ కొడుకుగా మీరు కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను” అని కార్తీక్ తన మనసులోని మాటను బయటపెడతాడు.
కాంచన సంచలన నిర్ణయం
ఎంతమంది ఎంత చెప్పినా, కాంచన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేకపోయింది. “పూర్తిగా మానేసిన దాన్ని మళ్లీ మొదలుపెట్టలేను. విడిపోయిన మనసులను కలపడం కష్టం” అని తేల్చి చెప్పేసింది. దీంతో శ్రీధర్ ఆశలన్నీ ఆవిరయ్యాయి. తన భర్తను కాంచన క్షమించకపోవడంతో ఈ కథనం ఎటువైపు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.
రేపటి ఎపిసోడ్ లో ఏమౌతుంది?
పారిజాతం నిజంగానే జ్యోత్స్న బండారాన్ని బయటపెడుతుందా? దాసు అదృశ్యం వెనుక జ్యోత్స్న హస్తం ఉందని తెలిస్తే పారిజాతం తట్టుకోగలదా? అలాగే కాంచన మనసు మార్చడానికి కార్తీక్ ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తాడా? అనే ప్రశ్నలకు రేపటి ఎపిసోడ్ లో సమాధానం దొరుకుతుంది.