Samsung Galaxy S26 : గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న శాంసంగ్ Galaxy S26 Ultra ధర? లీకైన వివరాలు ఇవే!
Samsung Galaxy S26 : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గెలాక్సీ ఎస్26 సిరీస్’ ( Galaxy S26 Series ) లాంచ్ సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెలలో (ఫిబ్రవరి) ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, లాంచ్‌కు ముందే ఈ ఫోన్ల ధరలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా కొత్త మోడల్ వస్తే ధర పెరుగుతుందని భావిస్తాం, కానీ అందుకు భిన్నంగా ఈసారి టాప్-ఎండ్ మోడల్ ధర తగ్గే అవకాశం ఉందని ప్రముఖ టిప్‌స్టర్ రోలాండ్ క్వాంట్ ( Roland Quandt ) వెల్లడించారు.
Samsung Galaxy S26 : గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న శాంసంగ్ Galaxy S26 Ultra ధర? లీకైన వివరాలు ఇవే!
Samsung Galaxy S26 Galaxy S26 Ultra ధర తగ్గే ఛాన్స్
లీకైన సమాచారం ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా (Galaxy S26 Ultra) ధర తన గత మోడల్ (S25 Ultra) కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. యూరప్ మార్కెట్ ధరల ప్రకారం చూస్తే, S26 అల్ట్రా ధర సుమారు 100 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.11,000) తక్కువగా ఉండొచ్చట. ఈ తగ్గింపు 256 GB, 512 GB వేరియంట్లకు వర్తించే అవకాశం ఉంది. ఉదాహరణకు, ప్రస్తుతం యూరప్‌లో S25 Ultra ప్రారంభ ధర 1,469 యూరోలు (సుమారు రూ. 1,62,000) ఉండగా.. రాబోయే S26 Ultra ధర 1,369 యూరోలు (సుమారు రూ.1,51,000) ఉండే ఛాన్స్ ఉంది. అయితే, టాప్ ఎండ్ 1TB వేరియంట్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. కేవలం అల్ట్రా మోడల్ మినహా, మిగిలిన రెండు మోడల్స్ (Galaxy S26, Galaxy S26+) ధరల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. గతేడాది వచ్చిన S25 సిరీస్ ధరలకే వీటిని కూడా లాంచ్ చేసే యోచనలో శాంసంగ్ ఉన్నట్లు సమాచారం.
Samsung Galaxy S26 series : పాత ధరలకే
Galaxy S26, S26 Plus మోడళ్లు పాత ధరలకే లభించే అవకాశం ఉంది. మెమరీ కాంపోనెంట్స్ (Memory Components) ధరలు పెరిగినప్పటికీ, ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా కంపెనీయే భరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రీ-ఆర్డర్ సమయంలో ఇచ్చే “ఫ్రీ స్టోరేజ్ అప్‌గ్రేడ్” (తక్కువ ధరకు ఎక్కువ స్టోరేజ్ వేరియంట్) ఆఫర్ ఈసారి ఉండకపోవచ్చని టాక్.
Samsung Galaxy S26 series : లాంచ్ ఎప్పుడు?
టెక్ వర్గాల సమాచారం ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో ఫిబ్రవరి 25న లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మార్చి 11 నుంచి సేల్ (Sale) ప్రారంభం కావచ్చు. భారత్‌లో కూడా ఇదే సమయానికి లేదా కొన్ని రోజుల తేడాతో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ధర తగ్గుదల వార్త నిజమైతే, శాంసంగ్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండగ లాంటి వార్తే. అధికారిక ప్రకటన కోసం మనం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.