Liver | కాలేయం ప్రమాదంలో ఉందా?.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
మన శరీరంలో కాలేయం (Liver) అత్యంత కీలకమైన అవయవం. ఇది రక్తప్రవాహం నుంచి హానికరమైన టాక్సిన్లను తొలగించడం, అవసరమైన ప్రోటీన్‌లను ఉత్పత్తి చేయడం, శక్తిని నిల్వచేయడం వంటి పలు ముఖ్యమైన పనులు చేస్తుంది. అయితే, నేటి బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కాలేయ వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ (Fatty Liver) , లివర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#image_title
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి?
ఫ్యాటీ లివర్ అనేది కాలేయం చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. ఈ కొవ్వు అధికమైతే కాలేయం పనితీరు తగ్గిపోతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది:
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD) – అధికంగా మద్యం సేవించే వారిలో కనిపిస్తుంది.
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) – మద్యం తక్కువగా లేదా అసలు తినని వారిలో కూడా కనిపించే ఫ్యాటీ లివర్ రకం.
నేటి కాలంలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎక్కువగా నమోదవుతోందని డాక్టర్ వినోద్ కె (గ్యాస్ట్రోలివర్ హాస్పిటల్, కాన్పూర్) చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ లక్షణాలు
ప్రారంభ దశల్లో ఫ్యాటీ లివర్‌కు స్పష్టమైన లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ కొన్ని సూచనల ద్వారా దీన్ని గుర్తించవచ్చు:
* కుడి ఎగువ భాగంలో కడుపు నొప్పి
* అధిక అలసట
* చేతులు, కాళ్లలో సిరలు గట్టిపడటం
* కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం (జాండిస్ లక్షణాలు)
* అధిక వాపు, కడుపు బిగుతు
* ఆకలి లేకపోవడం, వాంతులు రావడం
ఈ లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
ఫ్యాటీ లివర్ వ్యాధి ఊబకాయం , మధుమేహం , థైరాయిడ్ , కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే PCOS ఉన్న మహిళలు , టైప్ 2 డయాబెటిస్ రోగులు కూడా ఎక్కువ ప్రమాదంలో ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
లివర్ ఆరోగ్యానికి పాటించాల్సిన చిట్కాలు
* అధికంగా మద్యం సేవించడం మానేయండి
* ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి
* ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రై చేసిన ఆహారాన్ని తగ్గించండి
* ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోండి
* బరువును నియంత్రణలో ఉంచుకోండి
* రెగ్యులర్‌గా లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోండి