స్పీడ్ పెంచిన టీ- కాంగ్రెస్.. బీజేపీకి చెక్.. కారుకు బ్రేక్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

స్పీడ్ పెంచిన టీ- కాంగ్రెస్.. బీజేపీకి చెక్.. కారుకు బ్రేక్..?

 Authored By brahma | The Telugu News | Updated on :6 May 2021,2:30 pm

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక గతమే అని మాట్లాడిన నోళ్లు, ఇప్పుడు ఏమో గుర్రం ఎగరావచ్చు అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఒక పక్క తెరాస, మరో పక్క బీజేపీ దెబ్బకి కుదేలైన కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణ లో పైకి లేవటం కష్టమే అని అనుకున్నారు, పైగా ఆ పార్టీలో జరిగే రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేవంత్ రెడ్డి లాంటి పవర్ ఫుల్ లీడర్ కు కూడా సంకెళ్లు వేసి బంధించిన నేతలు ఆ పార్టీ సొంతం.

t congress increased speed brake for TRS

t congress increased speed brake for TRS

అయితే ఇదే విధంగా కొనసాగితే పార్టీ మనుగడ కష్టమని భావించిన ఢిల్లీ పెద్దలు, ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని చుసిన ప్రతి సారి పార్టీలోని సీనియర్ నేతలు ఒక రకమైన బెదిరింపులకు దిగేవారని సమాచారం. దీనితో ఢిల్లీ పెద్దలు ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. కానీ నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటంతో ఢిల్లీ హై కమెండ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు అయ్యిందని విశ్లేషకులు చెపుతున్నారు.

నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మరోధపా పార్టీలో సీనియర్స్ పెత్తనం కొనసాగేది. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అందుకోసమే పార్టీలోని కొందరు సీనియర్స్ ఎలాగైనా గెలవాలని తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు , ఒక దశలో జానారెడ్డి ముక్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రకటనలు కూడా చేశారు , కానీ ప్రజలు మరోసారి జానారెడ్డిని తిరస్కరించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో తెలిసింది. అదే విధంగా సీనియర్స్ సత్తా ఏమిటో తెలిసింది.

పీసీసీ చీఫ్ విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం

ఇక ఇప్పుడు సీనియర్స్ మాటకు ఢిల్లీ స్థాయిలో విలువ తగ్గినట్లే అని భావించవచ్చు. ఇదే అదునుగా రాష్ట్రంలో చేయాల్సిన మార్పులను వెంటనే చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దాదాపుగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు కాబోతుంది. నిజానికి కాంగ్రెస్ కు ఇప్పుడు అలాంటి నేతలే అవసరం ఉంది..

ఇదే సమయంలో సాగర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ స్థాయి ఏమిటో అందరికి తెలిసింది. తెరాస కు మేమె పోటీ అంటూ జబ్బలు చరిచిన బీజేపీ నేతలు ఆ ఫలితాలు చూసి మౌనముద్రలోకి వెళ్లారు. అదే సమయంలో లింగోజిగూడ కార్పొరేట్ ఉప ఎన్నికల్లో బీజేపీని పక్కకు నెట్టి కాంగ్రెస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ స్థానం బీజేపీది కావటం. సొంత సిట్టింగ్ స్థానాన్ని కూడా కాపాడుకోలేని బీజేపీ రాష్ట్రంలో తెరాస ను పోటీగా నిలబడలేదనే మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తెరాస కు కాంగ్రెస్ ఒకటే పోటీ ఇవ్వగలదని తెలుస్తుంది. అందుకే ఢిల్లీ పెద్దలు కూడా ఇక స్పీడ్ పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం

Advertisement
WhatsApp Group Join Now

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది